English | Telugu

అభయ్‌ది నా పోలిక... భార్గవ్‌ది ప్రణతి పోలిక!

మెగాస్టార్ చిరంజీవిని ఆయన మనవరాలు కొట్టింది. అది కూడా కాస్త గట్టిగానే! దాంతో నొప్పి తగ్గడానికి మెగాస్టార్ ఐస్ బ్యాగ్ పెట్టుకున్నారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ ఈ సంగతి చెప్పుకొచ్చారు. మనవరాలు కొట్టిన విషయాన్ని చిరంజీవి తనతో చెప్పారన్నారు. అసలు, చిరంజీవి టాపిక్ ఎందుకు వచ్చిందంటే...

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ముగ్గురి మధ్య కార్టూన్స్ డిస్కషన్ వచ్చింది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే తనకు ఇష్టమని కొరటాల అన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్ కూడా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ఇష్టం అని చెప్పారు. అప్పుడు ఈతరం పిల్లల అభిరుచి మారిందని, వ‌యొలెంట్ కార్టూన్స్ చూస్తున్నారని ఎన్టీఆర్, కొరటాల చెప్పుకొచ్చారు.

"మొన్న చిరంజీవిగారు చెబుతున్నారు. ఆయన సోఫాలో పడుకుంటే మనవరాలు వచ్చి గుద్దేసి వెళ్లిపోయిందట. ఆ పాప చూసే కార్టూన్స్ లో ఏదో క్యారెక్టర్ బాక్సింగ్ పంచ్ టైపులో కొడుతుందట" అని కొరటాల శివ పేర్కొన్నారు. వెంటనే తార‌క్ తనకూ అటువంటి అనుభవం ఎదురైందని అన్నారు. "మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్లిపోతాడు. ఎందుకు మూడ్ మారుతుందో తెలియదు" అని తార‌క్‌ అంటే... "అభయ్ అయి ఉండడు. భార్గవే" అని కొరటాల అన్నారు. భార్గవ్ కొట్టి ఉంటాడని పరోక్షంగా చెప్పారు. అందుకు జూనియ‌ర్‌ ఎన్టీఆర్ "అభయ్ ఎప్పుడూ నా పోలిక. సౌమ్యుడు, బావుంటాడు. భార్గవ్‌కి ప్రణతి పోలిక కదా! కొంచెం ఇదిగా ఉంటాడు. అంతే కదా! అంతే కదా!!" అని దర్శకులు ఇద్దర్నీ ఒప్పించే ప్రయత్నం చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.