English | Telugu

Eto Vellipoyindhi Manasu : అమ్మ మాట విని తీసుకున్నా.. గేట్ దగ్గర సెక్యూరిటీగా కూడా పనికిరావు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -241 లో......రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారని నందినికి హారిక చెప్తుంది. ఇప్పుడు రామలక్ష్మి అంటే సీతాకాంత్ మనసులో ఏదో చిన్న డౌట్ ఉంది. దాంతో ఎప్పటిలాగా తనతో సీతా ఉండలేడు. ఇంకా వాళ్ళని విడదియ్యాలి.. నా ప్లాన్ అంత తెలిసి కూడా ఎందుకు అలా అంటావ్ హారిక అని నందిని అంటుంది.

ఆ తర్వాత నందిని, హారిక ఇద్దరు వెళ్లేసరికి.. రామలక్ష్మి, సీతాకాంత్ లు ప్రేమగా కలిసి భోజనం చేస్తుంటారు. అది చూసి నందిని షాక్ అవుతుంది. అభి వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పార్ధలున్నాయన్నావ్.. ఎప్పటిలాగా ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు అనుకున్నది జరుగుతుందంటావా అని నందినితో హారిక అనగానే.. కోపంగా అక్కడ నుండి వస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా మంచి ప్లాన్ చేసి రామలక్ష్మి, సీతాకాంత్ లని విడగొట్టి మంచి కుర్ర విలన్ లాగా పేరు తెచ్చుకోవాలని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. మీరేం ప్లాన్ చెయ్యలేదు.. అన్ని ఫెయిల్ అవుతున్నాయంటూ శ్రీలతకజ చెప్తూ తనకి శ్రీవల్లి చిరాకు తెప్పిస్తుంది. ఆ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ రెడీ చేస్తాడు. ఇది సీతాకాంత్ అన్నయ్యతో నందినిని అప్రూవల్ చేయిస్తే నేను ప్రాజెక్ట్ హెడ్ అవుతానని హరికతో సందీప్ అంటాడు. అది అప్రూవ్ చెయ్యాలిసింది రామలక్ష్మి.. ఆ పవర్ తనకే ఉందని హరిక అనగానే.. ఆ ఫైల్ తో రామలక్ష్మి దగ్గరికి సందీప్ వెళ్లి ఫైల్ విసిరేసి చూడమంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి చూసి అన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తుంది. దాంతో రామలక్ష్మిని తిడతాడు సందీప్. అప్పుడే సీతా వచ్చి.. ఇంకొకమాట అంటే మర్యాద ఉండదని ఫైల్ తీసుకొని చూసి తను కాదు నేను వద్దని అంటున్నా.. అమ్మ మాట విని నిన్ను కంపెనీకి రానిస్తున్నా‌‌.. లేదంటే నువ్వు గేట్ దగ్గర సెక్యూరిటీకి కూడా పనికి రావని సందీప్ ని సీతాకాంత్ తిడతాడు. ఆ తర్వాత సందీప్ వెళ్లి.. జరిగింది మొత్తం శ్రీలతకి చెప్తుంది. శ్రీలత వెంటనే నందినికి ఫోన్ చేసి కోప్పడుతుంది. ఇద్దరం గొడవ పడడం దేనికి.. మన టార్గెట్ రామలక్ష్మి.. ఏం ప్లాన్ చేసావని శ్రీలత అడుగుతుంది. వాళ్ళని విడగొట్టేలా ప్లాన్ చేస్తున్నానని నందిని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కార్ లో వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.