English | Telugu

Brahmamudi : నా నిర్ణయం ఫైనల్.. రాజ్ కి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -547 లో.....కళ్యాణ్ పాడిన పాట నచ్చిన ప్రొడ్యూసర్ తనకి కొంతడబ్బు ఇచ్చి.. మీరేం చేస్తారో మీరు డిసైడ్ అవ్వండి. ఈ పాటని నేను వాడుకుంటున్నానని ప్రొడ్యూసర్ రైటర్ తో చెప్పి వెళ్లిపోతాడు. కళ్యాణ్ దగ్గరున్న డబ్బులు రైటర్ తీసుకొని కొంత డబ్బులు మాత్రమే కళ్యాణ్ కి ఇస్తాడు. నాకు అసిస్టెంట్ రైటర్ గా ఛాన్స్ ఇవండీ అని కళ్యాణ్ అనగానే.. అబ్బా అంత ఆశ ఉందా.. టచ్ లో ఉండు అంటూ రైటర్ కళ్యాణ్ ని వాడుకోవాలని కార్డు ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ వెళ్లేసరికి ఫ్యూన్ ఎండీ చైర్ లో కూర్చొని క్లీన్ చేస్తుంటాడు. అప్పుడే రాజ్ తనపై కోప్పడతాడు

సర్ ఇందాక చైర్ కింద పడిపోయింది. బాగుందో లేదో కూర్చొని చూస్తున్నానని అతను అనగానే.. సరే వెళ్లి టీ తీసుకొనిరా అని పంపిస్తాడు.ఈ సీట్ లో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలంటూ తనలో తానే గునుక్కుంటాడు. మరొకవైపు కళ్యాణ్ డబ్బులు తీసుకొని వచ్చి అప్పుకి ఇచ్చి జరిగిందంతా చెప్తాడు. త్వరలోనే రైటర్ కాబోతున్నావ్ .. ఇక బిజీ అయిపోతావని అప్పు అంటుంది. ఆ తర్వాత కావ్య పూజ చేసి ఆఫీస్ కి బయలుదేర్తుంటే.. కనకం వచ్చి అల్ ది బెస్ట్ చెప్తుంది.

మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే పనిమనిషి, ఇందిరాదేవి, అపర్ణ ముగ్గురు కావ్య గురించి మాట్లాడతారు. దాంతో రాజ్ చిరాకుగా ఆఫీస్ కి వెళ్తాడు. రాజ్ క్యాబిన్ కి వెళ్తుంటే.. మీ క్యాబిన్ అది.. అందులోకి లేడీ బాస్ వచ్చారని శృతి చెప్తుంది. రాజ్ కోపంగా వెళ్లేసరికి కావ్య ఉంటుంది షాక్ అవుతాడు. సెక్యూరిటీని పిలిచి లోపలికి ఎందుకు రానిచ్చావంటూ కోప్పడతాడు. అప్పుడే సీఈఓ గా అప్పాయింట్మెంట్ అయిన లెటర్ ని కావ్య ఇవ్వగానే.. షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఎందుకిలా చేశారంటూ రాజ్ ఇంటికి వచ్చి సీతారామయ్యని అడుగగా.. నా నిర్ణయం ఫైనల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.