English | Telugu

Karthika Deepam2 : కార్తీకదీపం-2 లో ఊహించని మలుపు.. ఆమె కోసమే ఈ పెళ్ళి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -182 లో... నువ్వు ఈ దీపతో తేల్చుకోవలిసినవి చాలా ఉన్నాయని జ్యోత్స్న అనగానే.. ఇంకేముంది జరగాల్సింది జరిగిపోయింది కదా అని దశరథ్ అంటాడు.ఆ తర్వాత నన్ను ఇంట్లో మనిషిలాగా చూసుకున్నారు. నేను ఏ తప్పు చెయ్యలేదు. నన్ను క్షమించండి అంటూ దీప ఏడుస్తుంది. దాంతో పారిజాతంతో పాటు అందరు దీపని ఏదో రకంగా మాటలంటూ బాధపెడతారు.

నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోమంటు దీపని జ్యోత్స్నని బయటకు గెంటేస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి దీపని పట్టుకుంటాడు. నువ్వు జరిగింది చేప్తే అర్థం చేసుకుంటారనుకున్నావ్.. వీళ్ళు శిక్షించే మనుషులే కానీ క్షమించే మనుషులు కాదంటూ కార్తీక్ అనగానే.. కార్తీక్ పై శివన్నారాయణ‌ విరుచుకుపడతాడు. తాత క్షమించలేదు కాబట్టి ప్రతీకారంగా దీప మెడలో తాళి కట్టావా బావ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప మెడలో తాళి కట్టింది ప్రేమతో.. శౌర్యపై ప్రేమతో.. తనకి నాన్న కావడం కోసమని కార్తీక్ అనగానే.. అయితే అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. అందరి మెడలో కడుతావా అని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ తనపై చెయ్యి ఎత్తుతాడు. నా మనవరాలిపై చెయ్యి ఎత్తుతావా అంటూ శివన్నారాయణ‌ విరుచుకుపడతాడు. నన్ను తాతయ్య క్షమించాడని చెప్పడానికి మీ ఇంటికి వచ్చా.. అప్పుడే దీప మెడలో తాళి కట్టావని జ్యోత్స్న అంటుంది. నీకు మా అమ్మ గుర్తు రాలేదా అంటూ జ్యోత్స్న అడుగుతుంది. గుర్తు రాలేదు ఎందుకంటే మీరే వద్దనుకుంటారు.. మీరే కావాలనుకుంటున్నారు. అంతా మీ ఇష్టమేనా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత దీపని పారిజాతం తిడుతుంటే.. దీప నా భార్య. తనని ఏమైనా అంటే నన్ను అన్నట్లేనని తనని తీసుకొని వెళ్తుంటే.. అందరి మొహలు మాడిపోతాయ్. మరొకవైపు కావేరి దగ్గరికి శ్రీధర్, పారిజాతం వస్తారు. దీపని కార్తీక్ పెళ్లి చేసుకున్న విషయం చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. అంత నీ వళ్లే.. ఇలా రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా అంటూ కావేరీ, శ్రీధర్ ని పారిజాతం తిడుతుంటే.. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అంటూ పారిజాతం మొహంపై శ్రీధర్ తలుపులు వేస్తాడు. దాంతో పారిజాతం మీ అందరి సంగతి చెప్తానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...