English | Telugu

Brahmamudi : వినాయకుడి పూజలో భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటవ్వగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -522 లో......కావ్య వినాయకుడి విగ్రహానికి కలర్ వేస్తుంటుంది. అప్పుడే కృష్ణ మూర్తి వచ్చి ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. ఇది ఈ రోజే పూర్తి చేయాల్సిన విగ్రహమని కావ్య అంటుంది. ఈ వినాయకుడి ద్వారా అయిన అల్లుడు నువ్వు ఇద్దరు ఒకటి అయితే బాగుండని కృష్ణమూర్తి అనగానే... కావ్య కోపంగా చూస్తుంది. దాంతో కృష్ణమూర్తి లోపలికి వెళ్తాడు. మరొకవైపు సీతారామయ్య ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. ఈసారి వినాయకుడి గురించి అందరు మర్చిపోయినట్లున్నారు ఏర్పాట్లు చెయ్యడం లేదని అంటాడు.

ఆ తర్వాత నా భార్య బాగోలేదు.. నా కోడలు ఇంట్లో లేదు.. ఇప్పుడు ఎందుకని ప్రకాష్ అనగానే.. ఐశ్వర్యం ఆనందం ఉంటేనే దేవుడిని పూజిస్తావా.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని పూజిస్తే ప్రశాంతంగా ఉంటుందని సీతారామయ్య అంటాడు. ఈ సారి రాజ్ ఒక్కడే ఈ ఏర్పాట్లు చెయ్యాలని సీతారామయ్య చెప్తాడు. అందరు వెళ్ళిపోతారు. రాజ్ వెళ్తుంటే నువ్వు ఒక్కడివి చేస్తే అయిన పక్క వాళ్ళ మాటలు పట్టించుకొని భార్యని దూరం పెట్టే అజ్ఞానం నుండి బయటకు వస్తావని అపర్ణ అంటుంది. మరొకవైపు మన పెళ్లి అయ్యాక వస్తున్న మొదటి వినాయకుడి పండుగ జరుపుకోవాలని అప్పుతో కళ్యాణ్ అంటాడు. నాకు వినాయకుడిని నేను తయారు చెయ్యడం వచ్చని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పు వినాయకుడిని తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకొని రెడీ చేస్తుంటే.. అప్పుడే బంతి కృష్ణమూర్తి విగ్రహం పంపాడని తీసుకొని వస్తాడు.

ఆ తర్వాత కావ్య తను రెడీ చేసిన విగ్రహం షాప్ అతనికి ఇవ్వడానికి వస్తుంది. ఆ తర్వాత కావ్య సైకిల్ పై వెళ్తుంటే.. అప్పుడే రాజ్ కార్ పై వచ్చి కావ్యకి డాష్ ఇస్తాడు. ఇద్దరు కాసేపు గొడవ పెట్టుకుంటారు. జీవితంలో ఎప్పుడు నీ దగ్గరికి రానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో పూజకోసం రాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక కావ్యకి ఫోన్ చేయమని ఇందిరాదేవి అంటుంది. ఎందుకని రాజ్ అనగానే.. పూజ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుందని అపర్ణ అంటుంది. ఈ పూజలో మీ దంపతులు కూర్చోవాలని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ లు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...