English | Telugu
Karthika Deepam2 : బూచోడు వస్తాడని దాక్కున్నా.. నువ్వు ఉంటే రాడని వచ్చాను!
Updated : Aug 9, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2 ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -118 లో.....లాయర్ జ్యోతి దగ్గరికి దీప వస్తుంది. ఏంటి దీప ఇలా ఉన్నావని తను అడుగుతుంది. ఏమైంది నిన్ను కార్తీక్ తీసుకొని వచ్చాడా అని అడుగుతుంది. లేదమ్మా నాకు విడాకులు కావాలి.. అలసిపోయాను అమ్మ.. ఇక పడిపోతుంటే పట్టుకుంటే అసభ్యంగా లాయర్ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానని దీప ఏడుస్తుంది. అలా గెలవడానికి ఎన్నో మాట్లాడుతారు.. వాటిని పట్టించుకోకని జ్యోతి అంటుంది. మీరు విడాకులకి అప్లై చేయండి కానీ విడాకులు అంత ఈజీగా రావు అని జ్యోతి అంటుంది. మీరు చెయ్యండి.. వచ్చేలా నేను చేస్తానని దీప చెప్పి వెళ్ళిపోతుంది. నేనేదో భార్యాభర్తలని ఒకటి చెయ్యాలని చూస్తుంటే.. దీప ఏంటి? అయినా బలమైన కారణం ఉందేమో అందుకే అంటుందని జ్యోతి అనుకుంటుంది.
సుమిత్ర దీప గురించి దశరత్ తో మాట్లాడుతుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోయినందుకు ఎందుకు ఆలోచించలేకపోతున్నావ్ .. కోర్ట్ లో తన బావపై నిందలు పడుతుంటే జ్యోత్స్న ఎంత బాధపడుతుంది. జ్యోత్స్న నా కూతురు.. కార్తీక్ నా అల్లుడు.. కార్తీక్ గురించి తెలుసు కాబట్టి నేనేం అనుకోవట్లేదు.. వాళ్ళ మీద ప్రేమ వేరే దీప మీద అభిమానం వేరే అని సుమిత్ర అంటుంది. మరొకవైపు దీప ఇంటికి వచ్చి శౌర్యని పిలుస్తుంది. శౌర్యా ఎక్కడ కన్పించదు. దాంతో కంగారుగా సుమిత్ర దగ్గరికి దీప వెళ్తుంది. శౌర్య గురించి అడుగగా బయటే ఆడుకుంటుందని సుమిత్ర అంటుంది. లేదని దీప అనగానే.. పద వెతుకుదామని సుమిత్ర అంటుంది. కార్తీక్ కి దీప ఫోన్ చేస్తుంది కానీ అతను లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత కార్తీక్ ఫోన్ చూసుకుని చేసేసరికి ఫోన్ స్విచాఫ్ వస్తుంది.ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి.. శౌర్య కన్పించడం లేదట అని చెప్తుంది. కోర్ట్ తీర్పు రాకముందే నర్సింహా తీసుకొని వెళ్ళాడన్నమాట మళ్ళీ దీప వెనక్కి తీసుకొని వచ్చే ఛాన్స్ లేదని జ్యోత్స్న అనుకుంటుంది.
మరొకవైపు నర్సింహా తీసుకొని వెళ్లి ఉంటాడని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్య కన్పించడం లేదని నరసింహా తీసుకొని వెళ్లి ఉంటాడని అంటుంది. లేదు కోర్ట్ లో కేసు నడుస్తుంటే అలా తీసుకొని వెళ్ళడు.. పైగా సాక్ష్యం తనకి అనుకూలంగా సంపాదించాడు కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే శౌర్య బీరువాలో దాక్కొని బయటకు వచ్చి.. కార్తీక్ అంటుంది. ఇంట్లో ఉండి పిలుస్తుంటే ఏం చేస్తున్నావని దీప అనగానే. బూచోడు వచ్చి తీసుకొని వెళ్తాడని బీరువాలో దాక్కున్నానని శౌర్యా అంటుంది. ఎవరన్నారు తీసుకొని వెళ్తారని దీప అడుగగా.. జో చెప్పిందని శౌర్య అంటుంది. నేను బూచోడు దగ్గరికి వెళ్ళను అమ్మ అని శౌర్య అంటుంది. కార్తీక్ నువ్వు ఉంటే బూచోడు రాడు.. అందుకే నీ మాట వినగానే వచ్చానని శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.