English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్త వేసిన కొత్త ప్లాన్.. కోడలు కనిపెట్టగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -162 లో....సీతాకాంత్ ఇంట్లోనే క్యాండిలైట్ డిన్నర్ ని ఏర్పాటు చేస్తాడు. రామలక్ష్మిని కళ్ళు మూసుకొని తీసుకొని వస్తాడు. దాంతో రామలక్ష్మి సర్ ప్రైజ్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని శ్రీవల్లి, శ్రీలతలు చాటుగా వింటారు. ఇప్పుడు రామలక్ష్మి ఒక డౌట్ అడుగుతుంది చూడమని శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి మిమ్మల్ని ఒకటి అడగాలని సీతాకాంత్ తో అంటుంది.

ఏంటి అడుగు అని సీతాకాంత్ అడుగుతాడు. మీకు ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని నమిత గురించి అడగలేక రామలక్ష్మి ఇండైరెక్ట్ గా అడుగుతుంది. సీతాకాంత్ నమిత తన విషయం ఎవరికీ చెప్పొద్దన్న విషయం గుర్తుకూ చేసుకొని.. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. వాళ్ళ మాటలు వింటున్న శ్రీలత.. ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మికి అబద్ధం చెప్పాడని శ్రీవల్లితో శ్రీలత అంటుంది. అసలేం చేస్తున్నారు చెప్పండి అత్తయ్య అని శ్రీవల్లి అడుగుతుంది. అయిన శ్రీలత చెప్పదు. ఆ తర్వాత నమితకి శ్రీలత ఫోన్ చేస్తుంది. మన ప్లాన్ ఫెయిల్ అయింది మేడమ్.. సర్ ఎంత టెంప్ట్ చేసిన టెంప్ట్ అవ్వలేదని నమిత అనగానే.. నాకు తెలుసు వాడు టెంప్ట్ అయ్యే రకం కాదని చెప్తుంది. వీడియో తీసావ్ కదా చాలు.. నేను చెప్పినట్టు చేయమని శ్రీలత చెప్తుంది.

మరుసటి రోజు సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. ఏంటి ఇంత లేటు అని రామలక్ష్మి అడుగుతుంది. ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తుంటే.. నువ్వేంటి అలా రెడీ అయ్యావ్ యజమాని భార్య ఎలా ఉండాలి.. నేను రెడీ చేస్తాను పదా అంటూ లోపలికి తీసుకొని వెళ్లి మల్లెపూలు పెడుతుంది.. ఏం ప్లాన్ చేస్తున్నారని శ్రీలతని రామలక్ష్మి అడుగుతుంది. ఆఫీస్ కి వెళ్ళాక నీకే తెలుస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు వెళ్తుంటే గుమ్మడికాయ కిందపడుతుంది. ఒకసారి లోపలికి వెళ్లి వద్దామని రామలక్ష్మి అంటుంది. దాంతో ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్ కి వెళ్తారు. ఆఫీస్ కి వెళ్ళాక కూడా రామలక్ష్మి.. అత్తయ్య ఏం ప్లాన్ చేయబోతుందనే దాని గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.