English | Telugu

Karthika Deepam2 : ఆ ఇద్దరిని అలా చూసేసిన జ్యోత్స్న.. కార్తిక్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'(karthika depam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో.... జ్యోత్స్న ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తారు. అసలు నీతో పెళ్లి మీ బావకి ఇష్టం లేదు.. ఉంటే ఎంగేజ్ మెంట్ ని వదులుకొని ఆ పాప కోసం వెళ్తాడా అని అంటారు. మీ బావ తో పెళ్లి అనే ఆలోచన చేయకుంటే మంచిదని వాళ్ళ అంటుంటే.. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. అసలు మీరు ఫ్రెండ్సేనా మంచిగా ఆలోచించాలి గానీ ఇలా మాట్లాడుతారా అని కోప్పడుతుంది. మేమ్ తప్పుగా ఏం అన్లేదు.. నిజం మాట్లాడాం.. మేమ్ వెళ్లి పోతున్నామంటూ జ్యోత్స్న ఫ్రెండ్స్ వెళ్లిపోతారు.

ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముందని జ్యోత్స్న అంటుంది. వాళ్ళని అన్నట్టే ఆ దీపని అని ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు.. అసలు అడగాల్సిన వాళ్ళని అడగాలంటూ జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. ఇప్పుడు వెళ్లి దీపతో గొడవపడుతుందేమోనని సుమిత్ర టెన్షన్ పడుతుంది. మరొకవైపు అనసూయ దగ్గరికి శోభ వచ్చి.. మీరు తిట్టిన తిట్లకి మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదని అంటుంది. పాపని కావలి అనుకున్నాం.. తెచ్చుకునే పద్ధతి అదేనా.. అసలు వాడు కన్నతండ్రేనా.. నా పాప పడిపోయి ఉంటే ఏమైనా కానివ్వంటూ తీసుకోని వస్తున్నాడు. ఆ కార్తీక్ పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడని అనసూయ అనగానే.. ఆ కార్తీక్ నే ఆ పాప తండ్రి కావచ్చని శోభ అనగానే.. శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది. దాని పుట్టుక గురించి మాట్లాడకంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎవరిని పెంచుకోవాలని శోభ అంటుంటే.. నన్ను పెంచుకోవే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అనసూయ.

ఎక్కడికి వెళ్ళా అని మాటివ్వు అని శౌర్య అనగానే కార్తీక్ మాటిస్తుంటాడు. అప్పుడే వద్దని దీప శౌర్య చెయ్ ఆపుతుంది‌. దాంతో కార్తీక్ దీప చెయ్ పైన చెయ్ వేస్తాడు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. కార్తీక్ బయటకు రాగానే జ్యోత్స్న మాట్లాడుతుంది. అప్పుడే దీప కూడా వస్తుంది. ఇద్దరి గురించి జ్యోత్స్న, పారిజాతంలు తప్పుగా మాట్లాడతుంటే.. కార్తీక్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక దీప బాధపడుతుంటే.. వాళ్ళ మాటలు పట్టించుకొకని కార్తిక్ చెప్తాడు. పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వచ్చి భోజనం చేద్దామని అంటుంది. నేను చెయ్యను అనగానే.. నువ్వు నా పైన చాలా ప్రేమ చూపిస్తావని జ్యోత్స్న అంటుంది. నువ్వు దశరత్ కూతురివి కాదే నా కొడుకు దాస్ కూతురువి నిన్ను ఈ ఆస్తులకి వారసురాలిని చేస్తేనే నా కొడుకుకి న్యాయం చేసిన దాన్ని అవుతానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతంలని పిల్వక ముందే అందరు భోజనం చేస్తుంటే జ్యోత్స్న కి కోపం వస్తుంది. అప్పుడే సుమిత్రకి కార్తీక్ ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.