English | Telugu

Guppedantha Manasu : రంగాను కౌగిలించుకున్న వసుధార...వామ్మో నిజమేనా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(guppedantha Manasu ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1140 లో..... రంగా అలియాస్ రిషికి తన కుటుంబం గురించి ఫొటోస్ తో వివరిస్తాడు శైలేంద్ర. వసుధర గురించి మాత్రం చెప్పకుండా ఫోటో రివర్స్ పెడతాడు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పట్లేదని రిషి అడుగుతాడు. తను ఇప్పుడు స్టోరీ లో లేదని శైలేంద్ర అంటాడు. ఒకవేళ వస్తే అని రిషి అడుగుతాడు. వచ్చే ఛాన్స్ లేదు.. అందుకే చెప్పట్లేదని శైలేంద్ర అంటాడు. రేపు ఎలా ఉండాలో అర్థం అయింది కదా అని రంగాని శైలేంద్ర అడుగగానే.. అర్థం కాలేదు సర్ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుందని రిషి అంటాడు. సరే చూపిస్తాను కానీ మన ప్లాన్ తెలిసిపోతుంది కదా అని శైలేంద్ర అంటాడు.

దూరం నుండి చూపించండి.. నేను అర్ధం చేసుకుంటానని రిషి అంటాడు. ఇంకొకటి రంగా.. నువ్వు నన్ను సర్ అని పిలవకూడదు.. వాళ్లకి డౌట్ వస్తుందని శైలేంద్ర చెప్పగానే.. సరే అన్నయ్య అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషిగా రంగాని ఇంటికి తీసుకొని వెళ్తాడు శైలేంద్ర. రిషి కిటకి దగ్గర నుండి అందరిని చూస్తుంటాడు. శైలేంద్ర ఇంట్లో అందరిని హాల్లోకి పిలుస్తాడు. కిటికీలో నుండి చూస్తున్న రంగాకి అన్ని అర్థమయ్యేలా అందరిని వరుసలు పెట్టి పిలుస్తాడు. రేపు మన కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. నాకు అదే బాధగా ఉంది ఆ బాధని పంచుకోవడానికి మిమ్మల్ని పిలిచానని శైలేంద్ర అంటాడు. మహేంద్రకి డాడ్ అంటూ పిలిచినట్లు అనిపిస్తుంది. ఎవరో పిలిచారని మహేంద్ర అనగానే.. మీ భ్రమ అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి వెళ్తూ ఏదో కింద పడేస్తాడు‌. ఆ సౌండ్ కి అందరు బయటకు వస్తారు. ఆ లోపే రిషి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. రేపు ప్రొద్దున ఏం చెయ్యాలో గుర్తు ఉంది కదా అని అడుగుతాడు. ఎలా కాలేజీ కి వస్తావని అడుగగా ఆటోకి వస్తానని రిషి చెప్తాడు. ఆ తర్వాత రిషి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి డోర్ ఓపెన్ చేసి ఉందని అనుకుంటాడు. అప్పుడే వసుధార వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటుంది. మీరు రంగా కాదు రిషి సర్ అని తెలుసంటూ తన ప్రేమని చెప్తుంది. పొగరు కదా తెలుసుకున్నావ్.. ఇంకా ఎందుకు ఏడుస్తావంటూ రిషి తన ప్రేమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.