English | Telugu

అనసూయ భర్తగా దొరబాబా?!

అనసూయ పేరు బుల్లితెరపై ఇప్పుడు మస్త్ ఫేమస్. తెలుగు ఆడియెన్స్ కి మంచి ఫేవరెట్ కూడా. అందం, అభినయంతో ఎప్పుడూ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. స్టార్ హీరోస్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై నటించి వ్వావ్‌ అనిపించింది. తెలుగులో టీవీ షోస్, ఈవెంట్స్ , మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇలాంటి నవ్వుతూ నవ్విస్తూ ఉండే అనసూయకు మస్త్ కోపం వచ్చింది. కోపం తెప్పించింది ఎవరో కాదు జబర్దస్త్ షో స్క్రిప్ట్. ఈ షోలో రకరకాల స్కిట్లు ఉంటాయి. వీటిల్లో భాగంగా జడ్జెస్ మీద, యాంకర్స్ మీద జోక్స్ వేసే స్కిట్స్ కూడా ఉంటాయి. అలాంటి స్కిట్స్ కొన్నిసార్లు పేలతాయి, ఇంకొన్ని సార్లు ఫెయిలవుతాయి.

అందులో భాగంగానే నెక్స్ట్ వీక్ ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ పై ఒక స్కిట్ చేశారు. స్కిట్ పేరు సెలబ్రిటీస్ హోమ్ టూర్ అన్నమాట. ఇందులో హైపర్ ఆది టీమ్ లో ఉండే రైజింగ్ రాజు అనసూయ వేషంలో కనిపిస్తాడు. భర్త భరద్వాజ్ కేరెక్టర్ లో దొరబాబు కనిపిస్తాడు. 'రాముడి లాంటి మా ఆయనకు దొరబాబుని ఇచ్చారా. ఇప్పుడు ఈ హోమ్ టూర్ చాలా వయలెంట్ అవ్వాల్సి వస్తుంది' అంటూ అనసూయ ఫన్నీగా చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.