English | Telugu
అప్పుడు పిల్ల బచ్చాను.. అందుకే ఐ లవ్ యూ చెప్పాను!
Updated : Jun 13, 2022
అరియానా గ్లోరీ అంటే బిగ్ బాస్ సీజన్ 4 గుర్తొస్తుంది. అందులో టాస్కులు బాగా ఆడి ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది అరియానా. అంతే కాదు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియో మస్త్ వైరల్ కూడా అయ్యింది. ఆర్జీవీ, అరియానా మధ్య ఎఫైర్ నడుస్తోందని కూడా పుకార్లు షికారు చేశాయి. అలా అరియానా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆమె 2015 లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని చానెల్స్ లో ఎంతో మందిని ఇంటర్వూస్ చేసి మంచి పాపులర్ అయ్యింది. ఐతే జెమినీలో కెవ్వు కామెడీ షో యాంకర్ గా ఆమె మంచి ఫేమస్ అయ్యింది.
బిగ్ బాస్ షో 4 వ సీజన్ లో టెన్త్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది అరియానా. ఐతే ఈ షోలో బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కి ఎన్నో సార్లు ఐ లవ్ యూ చెప్పింది. బిగ్ బాస్ వల్లనే తనకు మంచి నేమ్, ఫేమ్ వచ్చిందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. 'బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5 బజ్, నాన్ స్టాప్ బిగ్ బాస్ మొత్తాన్ని మూడేళ్లకు కాంట్రాక్టు తీసుకున్నావా ఏమిటి' అన్న యాంకర్ ప్రశ్నకు, 'నిజంగా అదృష్టం ఎలా వచ్చి వరిస్తుందో తెలీదు. నాకు బిగ్ బాస్ రూపంలో వచ్చింది. నేను బిగ్ బాస్ కి దత్త పుత్రికను. అన్ని లాంగ్వేజస్ లో చూసుకుంటే నేనే ఎక్కువగా బిగ్ బాస్ కి వర్క్ చేశానేమో' అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
'బిగ్ బాస్ 4 లో ఎక్కువసార్లు ఐ లవ్ యూ చెప్పా కానీ ఓటిటిలో చాలా తక్కువ సార్లే చెప్పాను' అంటూ మనసులో మాట చెప్పింది. 'అప్పుడంటే స్టార్టింగ్ కాబట్టి ఎక్సయిట్మెంట్ ఉంటుంది, అందులోనూ పిల్ల బచ్చాను కాబట్టి అన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పాను. తర్వాత మైండ్ మెచ్యూర్ అయ్యింది కాబట్టి తక్కువ సార్లు చెప్పాను' అంటోంది అరియానా. నైస్ ఇంటర్వ్యూ, మంచి ఫ్రెండ్షిప్ ఇద్దరిది, అంటూ నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.