English | Telugu

హ‌రి పేరు టాటూగా వేసుకున్న ప‌దిమంది అమ్మాయిలు! అషు సంగ‌తేంటి?

అషు పేరును చెస్ట్ మీద టాటూగా వేయించుకుని టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు హ‌రి. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాద‌నీ, నిజ‌మైన టాటూయేన‌నీ హ‌రి నిరూపించాడు. 'కామెడీ స్టార్స్' షోలో అషు-హ‌రి జోడీ బాగా పాపుల‌ర్ అయింది. వ‌చ్చే ఆదివారం ఎపిసోడ్‌లో టాటూ మీద మ‌రో స్కిట్ చేశాడు హ‌రి. అయితే ఈసారి అషు లేకుండా ఈ స్కిట్‌ను చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఒక కాలేజీ అమ్మాయితో, "నేను మిమ్మ‌ల్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమించాను తెలుసా?" అని చెప్పాడు హ‌రి. "అదేంటీ.. బ‌య‌టంతా వేరేవాళ్ల పేరేసుకున్నార‌ని చెప్పారు?" అని అడిగిందామె. "అవి జ‌స్ట్ పేర్లు.. తుడిపేస్తే ఇలా చెరిగిపోతాయ్" అని యాక్ష‌న్ చేస్తూ చెప్పాడు హ‌రి.

దాంతో జ‌డ్జి శ్రీ‌దేవి క‌ల‌గ‌జేసుకొని "ఏయ్‌.. అషుతో ఐపోయారే హ‌రి మీరు" అంది. దాంతో ఖంగుతిన్న‌ట్లు ఎగిరి గంతేసి, న‌వ్వేశాడు హ‌రి. ఆ త‌ర్వాత వీల్ చైర్‌లో కూర్చొని క‌నిపించాడు హ‌రి. అత‌ని వెనుక ప‌దిమంది అమ్మాయిలు నిల్చున్నారు. "నేను ఒక్క టాటూ వేసుకున్నందుకే మీరు నాలో అంత ప్రేమ‌ను చూశారు. ఈరోజు ప‌ది మంది అమ్మాయిలు ప‌ది చేతుల మీద నా పేరు టాటూగా వేసుకున్నారు" అని ఎమోష‌న‌ల్ అవుతూ చెప్పాడు హ‌రి. అమ్మాయిలంద‌రూ HARI అని టాటూ వేయించుకున్న చేతుల‌ను చూపారు.

అదిచూసి శ్రీ‌ముఖి, "ఆ క‌టౌట్‌కి అంత‌మందంటే.. అయ్యో రామా!" అని పెద్ద‌గా న‌వ్వేసింది. వ‌చ్చే ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్‌లో హ‌రి టాటూ స్కిట్ బాగా న‌వ్వించ‌నున్న‌ట్లు లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. దీనిపై అషు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.