English | Telugu

చిక్కులో చిక్కుకునేదెవ‌రు?


కొత్త టాస్క్‌ల‌తో హౌస్‌మేట్స్ లోని పోటీత‌త్వాన్ని ప‌రీక్షిస్తున్న బిగ్‌బాస్ ఈరోజు "చిక్కులో చిక్కుకోకు" అనే టాస్క్ ఇవ్వ‌నున్న‌ట్లు కొత్త ప్రోమోలో వెల్ల‌డించారు. ఈ ప్రోమోలో "సారంగ‌ద‌రియా" పాట‌కు హౌస్‌మేట్స్ అంద‌రూ డ్యాన్స్ చేస్తూ స‌ర‌దాగా క‌నిపిస్తున్నారు.


బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఇచ్చిన చిక్కులో చిక్కుకోకు టాస్క్‌లో హౌస్‌మేట్స్ అంద‌రూ ఉత్సాహంగా పాల్గొన్నారు. "ఏ జంట అయితే ఎక్కువ బ‌రువు కోల్పోతారో వారిలో నుండే కెప్టెన్ పోటీదారులు ఎంచుకోబ‌డ‌తారు" అంటూ ర‌వి ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తున్న‌ది.


"తొలి వారం వాడికి అవ‌కాశం వ‌చ్చింది ఇప్పుడు నేను అడుగుతా వ్యాలీడ్ రీజ‌న్" అంటూ స‌న్నీ పేర్కొన‌డం..."ఫిజిక‌ల్ టాస్క్ కాకుండా వేరే టాస్క్ వ‌స్తే అప్పుడు ప‌రిస్థితి ఏంటి?" అంటూ అత‌డితో మాన‌స్ చెప్ప‌డం ఉత్కంఠ‌ను పంచుతున్న‌ది. శ్రీ‌రామ్ వ‌స్తాడ‌ని స‌న్నీ అన‌గా... "శ్రీ‌రామ్ వ‌స్తే నేను ఉంటా" అని గ‌ట్టిగా మాన‌స్‌ స‌మాధానం ఇవ్వ‌డం వెనుక ఏదో గూడుపుఠాని ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తున్న‌ది. శ్రీ‌రామ్‌, మాన‌స్‌ మ‌ధ్య ఏం జ‌రుగుతుందో ఈ రోజు ఎపిసోడ్‌లో తేల‌నుంది.