English | Telugu
కరెంట్ షాక్ తో కావ్య మర్డర్.. ఎంతకు తెగించార్రా!
Updated : Jan 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -628 లో..... కావ్య అన్న మాటలకి సుభాష్ బాధపడుతుంటే.. అప్పుడే ప్రకాష్ వచ్చి మాట్లాడతాడు. నలుగురిలో కావ్య అన్న మాటలకి భాదపడుతున్నావా అని ప్రకాష్ అడుగగా.. నలుగురెవరు మన ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్ళ ముందు పరువుపోయిందని అనుకోను కానీ కావ్య అలా అనడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నానని సుభాష్ అంటాడు. తనకి ఎంత పెద్ద సమస్య వచ్చిందోనని సుభాష్ అనగానే.. నేను నీలాగా ఆలోచించలేను అన్నయ్య. నిన్ను వదిన అర్ధం చేసుకుంటుంది కానీ నా భార్య నన్ను అర్ధం చేసుకోదు.. ఇక నేనేం చెయలేనని ప్రకాష్ వెళ్ళిపోతాడు.
అదంతా కావ్య వింటుoది. కావ్య భోజనం వడ్డీస్తుంటే.. ధాన్యలక్ష్మి ప్రకాష్ లు వద్దని అంటారు. మా అన్నయ్య, వదినలు రాలేదు అవమానం గా ఫీల్ అయి ఉంటారని రుద్రాణి అంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు.. పోనిలే మా వదినకి అయినా రోషం ఉందని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణికి స్వప్న కౌంటర్ వేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నది చెయ్యొచ్చు ఎందుకంటే ప్రకాష్ అన్నయ్య నీ వైపు ఉన్నాడంటూ చెప్తుంది. అవునని ధాన్యలక్ష్మి అంటుంది. సుభాష్ భోజనం చేసి వెళ్తుంటాడు. "థాంక్స్ మావయ్య.. ఎవరు నన్ను అర్ధం చేసుకోలేదు.. మీరు అర్ధం చేసుకున్నారు.. నేనేం చేసినా దాని వెనకాల కారణం ఉందని అనుకుంటున్నారు" అని సుభాష్ తో కావ్య అంటుంది. నేను మాయ విషయంలో తప్పు చేసానని అందరు నమ్మినప్పుడు ఒక్క నువ్వు మాత్రమే నన్ను నమ్మావు అమ్మ అని కావ్యతో పాజిటివ్ గా సుభాష్ మాట్లాడతాడు. అపర్ణ భోజనం చెయ్యలేదని ఇందిరాదేవి భోజనం తీసుకొని వచ్చి అపర్ణకి తినిపిస్తుంది.
కావ్య బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రాజ్ వస్తాడు. నందగోపాల్ బ్రతికి ఉంటే ఎవరికి నష్టం? ఎవరు ఇదంతా చేశారని కావ్య అంటుంది. అవును నేను ఈ కోణంలో అసలు అలోచించలేదు కనుక్కోవాలని రాజ్ అంటాడు. అనామిక సామంత్ లు చెస్ ఆడుతుంటారు. నంద గోపాల్ ని చంపించి రాజ్ వాళ్ళని ప్రాబ్లమ్ లోకి నెట్టావని అనామికతో సామంత్ అంటాడు. తరువాయి భాగంలో ఇక ప్లాన్ లు వద్దు.. పర్మినెంట్ సొల్యూషన్ చెప్తాను. ఆ కావ్యని లేపేస్తానని రుద్రాణితో రాహుల్ అంటాడు. కావ్య వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు పిండేస్తుంటే కరెంటు షాక్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.