English | Telugu
సీతాకాంత్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. భద్రాన్ని తీసుకొచ్చాడు!
Updated : Jan 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో... బస్తీలో అందరిని భద్రం కన్పించడా అని రామలక్ష్మి అడుగుతుంది. అందరు లేదని చెప్పడంతో.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. అప్పుడే పోలీసులు వస్తారు. రేపు మద్యాహ్నం కల్లా మీరు అడిగిన టైమ్ అయిపోతుందని చెప్తారు. రామలక్ష్మి, సీతాకాంత్ లు టెన్షన్ పడతారు. అప్పుడే సిరి ఫోన్ చేస్తుంది. మీరు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్న అన్నయ్య.. మీకేం సాయం కావాలన్న చేస్తానని సిరి అనగానే.. సరే అంటూ సీతాకాంత్ సిరికి ఏదో చెప్తాడు.
మరొకవైపు శ్రీలత మనిషి భద్రంకి ఫుల్ గా తాగిస్తాడు. నువ్వు, నేను చేతులు కలిపామనుకో బాగా దోచుకోవచ్చని అతనితో భద్రం చెప్తాడు సరే గానీ నువ్వు అసలు ఇక్కడ నుండి కదలకని అతను చెప్తాడు. మరి ఎవరైనా వస్తే అని భద్రం అనగానే.. ఎవరు రారు అని అతను చెప్తాడు. మరుసటి రోజు సీతాకాంత్ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. మా ఇల్లు అమ్మి వాళ్లకు డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని సీతాకాంత్ చెప్తాడు. నువ్వేం అంటావ్ రామాలక్ష్మి అని సీతాకాంత్ అడుగగానే.. మీ నిర్ణయానికే ఏకీభవిస్తున్నానని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ పోలీసులని తీసుకొని శ్రీలత ఇంటికి వెళ్తాడు. అమ్మ నేను ఈ ఇంటిని అమ్మి డబ్బు కట్టాలనుకుంటున్నానని చెప్తాడు.
ముందు నీ భార్య రామలక్ష్మి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని శ్రీలత అంటుంది. దాంతో రామలక్ష్మి కోప్పడుతుంది. ఇల్లు అమ్ముతున్నాం కదా ఒకసారి అంతా చూసుకొని వస్తానంటూ సీతాకాంత్ పైకి వెళ్లి భద్రాన్ని తీసుకొని వస్తాడు. అతన్ని చూసి అందరు షాక్ అవుతారు. వీడు ఇక్కడున్నాడని నాకు, సందీప్ కి మాత్రమే తెలుసు కదా అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి భద్రం ఇంట్లో ఉన్నాడన్న విషయం చెప్పిన సంఘటన గుర్తుచేసుకుంటుంది శ్రీలత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.