English | Telugu
Brahmamudi: కోయిలికి చుక్కలు చూపించిన రాజ్, కావ్య.. నిజం కనిపెట్టేశారుగా!
Updated : Nov 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-868లో రాజ్, కావ్య ముసలివాళ్ళ గెటప్ లో కోయిలి, రాహుల్ ఉండే ఇంటికి వస్తారు. ఏంటే ఈ ఇంట్లో పనివాళ్ళు లేరు.. దీనిది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని రాజ్, కావ్య అంటారు. పని వాళ్లు ఉన్నారని కోయిలి అంటుంది. అవునా ఎక్కడా అని ఇద్దరు అడగడంతో.. ఉండేవారు.. మా కంపెనీ సీక్రేట్స్ అన్నీ పక్కింటి వాళ్లకు చెప్పేస్తున్నారని మేమే తీసేశామని రంజిత్ అంటాడు. హో మరి ఇప్పుడు ఎలా.. నాకు ఒకరు వడ్డించకపోతే తినలేనే ఎలా పోదాం పదా ఈ ఇంట్లోంచి.. పదరా రాహుల్.. మనకు ఈ పిల్ల సెట్ అయ్యేలా లేదని రాజ్, కావ్య అంటారు. దాంతో రంజిత్, కోయిలి ఇద్దరూ బ్రతిమిలాడటం మొదలుపెడతారు. అయ్యో అయ్యో.. బామ్మగారు తాత గారు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అంటూ కూర్చోబెట్టి కోయిలీనే వడ్డిస్తుంది.
తినడం మొదలుపెట్టి రుచిగా లేని ఫుడ్ అంటూ.. కాకా హోటల్ నుంచి తెచ్చారా.. కాస్టీ ఫుడ్ కాదంటూ రాజ్, కావ్య తిడతారు. ఇక రాహుల్ వాళ్ళనే చూస్తుంటే.. నువ్వు చెప్పవేంట్రా అని రాజ్ బెదిరించడంతో ఫుడ్ బాలేదని రాహుల్ అంటాడు. రేపు వేరే మంచి హోటల్ నుంచి తెప్పిస్తాం ఫుడ్ అని రంజిత్ అంటారు. గుండరాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా బయట ఫుడ్ ఏంటని కావ్య అంటుంది. మా కోయిలీకి వంట రాదు కదా అని రంజిత్ అంటాడు. రాదా.. అయితే పదరా రాహుల్ అని రాజ్, కావ్య అంటారు. వంట నేర్చుకుంటాను.. బామ్మగారి దగ్గరే నేర్చుకుంటానని కోయిలీ అంటుంది. ఆ తర్వాత కోయిలీ తిట్టుకుంటూ ప్లేట్స్ తీసుకుని వంట గదిలోకి వెళ్తే.. రంజిత్ వెనుకే వస్తాడు. కోయిలీ వాళ్ల ఫుడ్ బిల్ ఒక్కరోజుకే ముప్పై వేలు అయ్యిందే.. ఇంకా నాలుగు రోజులుంటే మనల్ని నమిలేస్తారా అని రంజిత్ అంటాడు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో రాజ్, కావ్య గుమ్మం దగ్గరకు వచ్చి వింటారు. నమిలితే నమిలారు.. మనకు రెండు లక్షలు అవుతుంది. వాళ్ల దగ్గర కోట్లున్నాయి.. ఆ ముసలోళ్లను నాలుగు రోజులు చక్కగా చూసుకుంటూ ఆస్తి మొత్తం రాహుల్ గాడికి రాసేస్తారు.. వాడికి పెళ్లి పేరు చెప్పి వాడి దగ్గర లాగేసి గెంటేస్తాం అంతే అని కోయిలీ అంటుంది.
ఇక రాజ్, కావ్య అక్కడి నుంచి పక్కకు జారుకుని క్లారిటీ చూసుకుంటూ.. ఇది అసలు మ్యాటర్.. వీళ్లదగ్గర ఆస్తిపాస్తులేం లేవు.. అప్పులే ఉన్నాయి.. రాహుల్ గాడి కళ్లు తెరిపించాలంటే ఏదొకటి చెయ్యాలని ఇద్దరు అనుకుంటారు. చాలా సేపు ఆలోచిస్తారు. వీళ్లను మనం పెట్టే టార్చర్ చాలదు.. అలా పెట్టాలంటే వీళ్లకు గోల్డ్ బాబు అని ఒకడు ఉన్నాడు వాడ్ని దింపుతాను.. దుబాయ్ నుంచి వచ్చేశాడు.. వాడు కాస్త ఓవర్ చేస్తాడు కానీ వీళ్లకు వాడే కరెక్ట్ అని రాజ్ అంటాడు. సరే అయితే ఆ పని చెయ్యండి.. నేను కోయిలీ ఒళ్లు వంచే పనిలో పెడతానంటూ కావ్య అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రంజిత్ భుజం మీద కోయిలీ చెయ్యి వేసి.. రంజిత్.. అవసరం అయితే ఇంకో పది లక్షలు అప్పు చేద్దాం. కోట్లు ఆస్తి పక్కా లాగాలి వాళ్ల దగ్గర నుంచి అంటూ ఉంటుంది. ఇంతలో ముసలమ్మ కళావతి గుమ్మం దాకా వస్తుంది. నువ్వు చెప్పింది జరుగుతుంది అంటావా అని రంజిత్ అంటాడు. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకు కచ్చితంగా జరుగుతుందని కోయిలీ నమ్మకంగా. నాకు మాత్రం డౌట్ ఉందే ఎండుకప్ప అంటూ దగ్గరకు వస్తుంది కళావతి. ఇక రంజిత్, కోయిలీ కాస్త దూరం జరుగుతారు. ఏంటి బామ్మగారు అని కోయిలీ అనగానే.. నువ్వు పెళ్లి చేసుకునేది మా రాహుల్‌నా..? లేక ఈ దరిద్రుడినా రంజిత్ ని చూపిస్తూ అంటుంది. అయ్యో అదేం లేదు బామ్మగారు.. ఎంతైనా మా అక్క కూతురు కదా అందుకే కాస్త క్లోజ్‌గా ఉంటామని రంజిత్ కవర్ చేస్తాడు. అదంతా నాకెందుకులే కానీ.. రా.. రా వంట నేర్చుకుంటా అన్నావ్ కదా.. సాయంత్రానికి డిన్నర్ చేద్దువుగానీ.. ముందు డ్రెస్ మార్చుకో.. వచ్చి ముందు ఇల్లంతా శుభ్రం చెయ్ అని కావ్య అంటుంది. ఏంటి పని చేయడానికి చీర కట్టుకున్నావ్ అంటూ జుట్టు ముడేయించి.. పని మనిషిలా మార్చి.. ఇంటి పని చేయిస్తుంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే.