English | Telugu

Brahmamudi : దీపావళి వేడుకల్లో కావ్యకి షాక్.. ఆస్తిని పంచి ఇవ్వమన్న ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -563 లో....దుగ్గిరాల ఇంటి కోడళ్లకి ఇందిరాదేవి హరాలు తీసుకొని వస్తుంది. ముగ్గురు మనవళ్ళకి ఆ హారాలు ఇచ్చి తమ భార్యల మెడలో వెయ్యమని ఇందిరాదేవి చెప్తుంది. అలా అనగానే నేను వేయనని రాజ్ అంటాడు. దాంతో రాజ్ ని కావ్య పక్కకు తీసుకొని వెళ్లి.. బొద్దింక వచ్చినప్పుడు రాజ్ భయపడి కావ్య చంకనెక్కిన వీడియో చూపిస్తుంది. మీరు హారం వెయ్యకుంటే ఇది వైరల్ అవుతుందని రాజ్ ని కావ్య బ్లాక్ మెయిల్ చేస్తుంది.

ఆ తర్వాత కావ్య, రాజ్ లు లోపలికి వస్తారు. రాజ్ ఇది అన్నంత పని చేస్తుందని కావ్య మెడలో హారం వేస్తాడు. అలా రాహుల్, కళ్యాణ్ లు కూడా తమ భార్యల మెడలో హారం వేస్తారు. ఆ తర్వాత కళ్యాణ్ కి కావ్య పెన్ గిఫ్ట్ ఇస్తుంది. ఇది నీకు ఇష్టమైన రైటర్ పెన్ అంటుంది. దాంతో కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నువ్వు ఇంకా సినిమాలో మంచి మంచి పాటలు రాయాలని కావ్య, అప్పులు అనగానే.. ఏంటి కళ్యాణ్ సినిమాలకి పాటలు రాస్తుండా అని ప్రకాష్ అంటాడు. అంటే నా పేరుతో కాదని కళ్యాణ్ అంటాడు. అసిస్టెంట్ రైటర్ గా ఛాన్స్ కోసం చూస్తున్నానని అంటాడు. అయితే నువ్వు రాసిన పాట వినిపించమని ఇందిరాదేవి అనగానే కళ్యాణ్ ఫోన్ లో తన పాట వినిపిస్తాడు. అది అమ్మ గురించి ఉండడంతో ధాన్యలక్ష్మి ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత అందరు దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి.. లోపలికి రండి అంటూ తీసుకొని వెళ్ళి టీవీలో వచ్చే కళ్యాణ్ డాక్యుమెంటరి చూపిస్తుంది. అందులో కళ్యాణ్ ఆటో నడపడం చూసి అందరు షాక్ అవుతారు. ఈ అప్పు వల్ల నీకు ఈ సిచువేషన్ వచ్చిందంటూ ధాన్యలక్ష్మి మరొకసారి అవమానిస్తుంది. జన్మలో దాన్ని కోడలిగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మి అంటుంది. జన్మలో ఈ ఇంట్లో అడుగుపెట్టనని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో ఈ ఆస్తులు ముక్కలు చేసి కళ్యాణ్ ది కళ్యాణ్ కి ఇవ్వండి అని ధాన్యలక్ష్మి అనగానే.. అలా ఎందుకు అంటున్నారని కావ్య అంటుంది. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్లిపోయావ్.. నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.