English | Telugu

Brahmamudi : ఎందులోను తగ్గని భర్త.. రాజ్ తో కావ్య డీలింగ్ సూపర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -562 లో....దీపావళి పండుగ రోజు ఎంప్లాయిస్ కి బోనస్ ఇవ్వడానికి అంత సిద్ధం చేస్తారు. ఇలా నా చేతులు మీదుగా బోనస్ ఇచ్చే అర్హత నాకు లేదని కావ్య అంటుంది. ఎప్పుడు సీఈఓ చేతులు మీదుగానే బోనస్ ఇస్తామని ఇందిరాదేవి అంటుంది. కావ్య చేతుల మీదుగా బోనస్ ఇవ్వడానికి ధాన్యలక్ష్మి, రుద్రాణి అడ్డు చెప్తారు. కానీ రాజ్ మాత్రం ఎవరి చేతులు మీదుగా అయితే ఏంటి ఎంప్లాయిస్ కి మంచి జరిగితే చాలు అని అంటాడు.

ఆ తర్వాత కావ్య అందరికి బోనస్ చెక్కులు ఇస్తుంది. అందులో చివరగా మేనేజర్ రాజ్ పేరు కూడా ఉంటుంది. దాన్ని చూసి కావ్య ఇబ్బంది పడుతుంటే.. పర్లేదు ఇచ్చేయ్ అని ఇందిరాదేవి అంటుంది. కావ్య ఇస్తుంటే నువ్వు కూడా ఈ కంపెనీకి సీఈఓ అంటే ఎంప్లాయి అన్నట్లే కదా అని రాజ్ తనకి ఇచ్చిన చెక్ ని నేమ్ చేంజ్ చేసి కావ్యకి ఇస్తాడు. ఎందుకులోను వాడు తగ్గడని ఇందిరాదేవి, సీతారామయ్య లు నవ్వుకుంటారు. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. ప్లాన్ ఎక్కడికి వరకు వచ్చిందని అడుగుతుంది. నేను చూసుకుంటానని అనామిక అంటుంది. ఆ తర్వాత కావ్య కిచెన్ లో ఉంటే రాజ్ వచ్చి సీఈఓ వచ్చిన పని అయిపొయింది కదా ఇక వెళ్ళలేదు సీఈఓ అంటే.. ఎప్పుడు బిజీ గా ఉండాలి. ఎప్పుడు కంపెనీ గురించి ఆలోచించాలని రాజ్ అటువైపు తిరిగి మాట్లాడుతుంటే కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది. కావ్య ఎటు వెళ్ళిందంటూ రాజ్ వెతుకుంటూ ఉంటాడు.ఆ తర్వాత కావ్య వెనకాల నుండి వచ్చేసరికి కావ్యని చూసి బయపడి రాజ్ కింద పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది.

ఆ తర్వాత కావ్య వెళ్ళడానికి హాల్లో కి వస్తుంది. అప్పుడే ఇందిరాదేవి ముగ్గురు ఇంటి కోడళ్ళకి హారాలు తెస్తుంది. అవి రాహుల్, కళ్యాణ్ రాజ్ లకి ఇచ్చి మీరే మీ భార్యల మెడలో వెయ్యండి అని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో వెయ్యనని రాజ్ అనగానే..మీరు పక్కన పదండీ అని రాజ్ ని కావ్య పక్కకి తీసుకొని వెళ్లి మీరు నా మెడలో హారం వెయ్యండి లేదంటే ఈ వీడియో అందరికి చూపిస్తాను అని రాజ్ బొద్దింక ని చూసి కావ్య దగ్గర దాక్కుంటాడు కదా.. ఆ వీడియో రాజ్ కి చూపిస్తుంది‌. తరువాయి భాగంలో అందరు టపాసులు కాలుస్తూ హ్యాపీగా ఉంటారు. రుద్రాణి వచ్చి లోపలికి రండీ అంటూ టీవీ లో వచ్చే కళ్యాణ్ ఆటో నడిపే వీడియోని చూపిస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.