English | Telugu
Brahmamudi : రాహుల్ ఫ్రాడ్ ని కావ్య బయటపెట్టగలదా.. అసలేం జరిగిందంటే!
Updated : Aug 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -500 లో.....స్వప్న బెలూన్ లో లాఫింగ్ లిక్విడ్ ని వేస్తుంది. దాంతో రాహుల్, రుద్రాణి ఇద్దరు బెలూన్ ని పగులగొట్టడంతో ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. అది చూసిన స్వప్న.. నా చెల్లిని అవమానిస్తారా రాత్రి అంత నువ్వుతూ ఉండండి అని అనుకుంటుంది. రాహుల్ రుద్రాణిలు నవ్వుతు కిందకి వస్తారు. అక్కడ ధాన్యలక్ష్మి కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే రాహుల్ రుద్రాణిలు నవ్వుతూ వస్తుంటారు అదే పనిగా నువ్వుతుంటే ఏంటి ఎందుకు నవుతున్నారు.. నేను ఇక్కడ బాధపడుతుంటే మీరు హ్యాపీగా ఉన్నారని రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి. అయిన రుద్రాణి నవ్వుతు ఉంటుంది. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా వెళ్లిపోతుంది.
మనం ఎందుకు ఇలా నవ్వుతున్నామని రాహుల్ తో రుద్రాణి అంటుంది. నేను చెప్తాను.. నేనే బెలూన్ లో లాఫింగ్ లిక్విడ్ కలిపానని స్వప్న అంటుంది. అయిన రాహుల్ , రుద్రాణిలు నవ్వుతూనే ఉంటారు.మరుసటి రోజు ఉదయం కావ్య నిద్ర లేస్తుంది. తను వెళ్తుంటే తన చీర కొంగుపై రాజ్ పడుకొని ఉంటాడు. కావ్య చీర కొంగు తీస్తుండగా రాజ్ నిద్ర లేస్తాడు. కావ్య వెళ్ళిపోతుంటే రాజ్ తన కొంగు పట్టుకొని లాగుతాడు. కావ్యని రొమాంటిక్ గా దగ్గరికి తీసుకుంటాడు రాజ్. కావ్య కూడా అర్థం చేసుకొని కమిట్ అవుతుంది. మరొకవైపు ఇప్పుడు ఏం తిందామని అప్పు, కళ్యాణ్ లు అనుకుంటుంటే.. అప్పుడే పక్కింటి ఆవిడా వచ్చి.. అప్పుకి వరలక్ష్మి వాయినం ఇస్తుంది. అవి తిందామని అనుకుంటారు. అప్పుడే కనకం, కృష్ణమూర్తిలు వస్తారు. వాళ్ళు రావడం గమనించిన అప్పు వాటిని లోపల పెడుతుంది. కనకం కృష్ణమూర్తిలు అప్పు, కళ్యాణ్ లతో మాట్లాడుతారు. మీకు టిఫిన్ తీసుకొని వస్తానని అప్పు లోపలికి వెళ్తుంది. ఇంట్లో ఏం లేదు కదా.. ఏం తెస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పు వెళ్లి పక్కింటి ఆవిడ వాయినంగా ఇచ్చిన శనగలు, పోపు వేసి అరటిపండు తీసుకొని వస్తుంది. మేం డైట్ మెయిన్ టైన్ చేస్తున్నాం.. రోజు ఇవే తింటామని అప్పు అంటుంది. కానీ వాయినం ప్లేట్ కనకం చూస్తుంది.
ఆ తర్వాత మా ఇంటికి రండి అని కృష్ణమూర్తి అప్పు వాళ్ళని పిలుస్తాడు. మేమ్ రామని అప్పు చెప్తుంది. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. అక్రమంగా విదేశాల నుండి తెచ్చిన గోల్డ్ మన కంపెనీని అడ్డు పెట్టుకుని రాహుల్ కొనాలని చూస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే మన కంపెనీకి ప్రాబ్లెమ్ అవుతుందని స్వప్న అంటుంది. రాహుల్ ఫ్రాడ్ చేస్తున్నాడని కావ్య అందరి ముందు చెప్తుంది. నేను ఫ్రాడ్ చేస్తున్నానని ఆధారాలు ఏంటని రాహుల్ అంటాడు. నీ చేతిలోనే ఉన్నాయని కావ్య అంటుంది. చూడమంటు ఫైల్ తీసుకొని వచ్చి.. రాజ్ కి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.