English | Telugu
Brahmamudi : కొత్తజంటని ఆహ్వానించిన సీతారామయ్య.. ధాన్యలక్ష్మి ఏం చేయనుంది!
Updated : Aug 23, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -495 లో.. ఇందిరాదేవి ఇంట్లో వాళ్లందరిని పిలిచి వరలక్ష్మి వ్రతం గురించి చెబుతుంది. కొత్తజంట అయిన కళ్యాణ్, అప్పులతో వ్రతం చేయించాలనుకున్నట్లు ఇందిరాదేవి చెప్పడంతో.. అందరు షాక్ అవుతారు. మీ ఇంకో చెల్లి రావడం మీ చెల్లికి ఇష్టం లేనట్టుందని కావ్యతో రాజ్ అంటాడు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు. వాళ్లు ఇంటికి రావడానికి నేనే కారణమని ఎవరైనా అంటే అని కావ్య అనగానే.. వాళ్ల దుమ్ము దులిపేయ్ అని అపర్ణ చెప్తుంది.
సరే అందరం కలుస్తున్నాం.. వాళ్ల అమ్మ నాన్నలను కూడా పిలుద్దామని ప్రకాశం అంటాడు. అయితే వాళ్లంతా ఎందుకని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది.అందరూ గొడవ పడుతుంటే ఇంతలో సీతారామయ్య నేను చిట్టి వెళ్లి వాళ్లను పిలుచుకొస్తాం. అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మీరు మనవడి కోసం ఒక మెట్టు దిగి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు రుద్రాణి షాక్ అవుతుంది. తర్వాత కనకానికి ఫోన్ చేస్తుంది కావ్య. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నామని మూడు జంటలతో వ్రతం చేయించాలని అమ్మమ్మ తాతయ్య నిర్ణయం తీసుకున్నారని మీరు కూడా రావాలని చెప్తుంది. ఇప్పటి వరకు జరిగిందే చాలదన్నట్లు మళ్లీ మేమెందుకే అని కనకం అంటుంటే అపర్ణ ఫోన్ తీసుకుని రేపు మీకు లక్ష పనులు ఉన్నా వ్రతానికి రావాలని చెప్తుంది. మరోవైపు కళ్యాణ్, అప్పుల దగ్గరికి సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. ఇక కొత్తజంట వారి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ ఆత్మగౌరవాన్ని మేము గౌరవిస్తాం. మిమ్మల్ని శాశ్వతంగా తీసుకెళ్లడానికి ఒప్పించేందుకు మేము రాలేదు. రేపు శ్రావణ శుక్రవారం, వ్రతం చేయిస్తున్నాం. మీరు ఇద్దరు ఇంటికి రావాలని ఇందిరాదేవి అనగానే.. వ్రతమా.. అప్పుతోనా. తనకు అది సూట్ కాదు. కావ్య వదినతో చేయించండని కళ్యాణ్ అంటాడు. ఇక సీతారామయ్య రిక్వెస్ట్ చేయగానే.. కళ్యాణ్, అప్పులు సరేనంటారు.
ఇక రాజ్ తన గదిలో ఫుల్ మాస్ పెట్టి డ్యాన్స్ చేస్తుంటే.. అప్పుడే కావ్య వస్తుంది. ఏమైందని కావ్య అడుగగా.. రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని రాజ్ అడుగుతాడు. కాసేపు ఇద్దరు గొడవపడతారు. కళ్యాణ్ వాళ్లు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా అని రాజ్ అనగానే.. నాకెందుకు ఇష్టం లేదు. మా చెల్లి కూడా వస్తుంది కదా అని కావ్య అనగానే.. ఈ నటించడం చిన్నపిల్లల దగ్గర నటించు. అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. రేపు పూజ కోసం మాత్రమే కళ్యాణ్ వాళ్లు రావట్లేదు. వచ్చేవాళ్లు తిరిగి వెళ్లరని రాజ్ అంటాడు. కవిగారు ఎలా ఒప్పుకుంటారని కావ్య అనగానే.. అది నీ మట్టి బుర్రకి అర్థం కాదని చెప్పి పడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.