English | Telugu
Brahmamudi : ఆస్తి అంటే మోజు పెరిగిందా.. అందుకే అలా అన్నావా?
Updated : Aug 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -491 లో....కళ్యాణ్ తను రాసిన బుక్ ని ఒకతను అమ్ముతుంటే.. ఆ బుక్ కావాలని అడుగుతాడు కానీ వాటికి డబ్బులు ఉండవు. ఎప్పుడైనా ఇవ్వండి కవుల పరిస్థితి ఇంతేనని అతను అనగానే.. నేను కవిని అని మీకెలా తెలుసని కళ్యాణ్ అనగానే.. ఆ బుక్ పై మీ ఫోటో చుసినా అని అతను చెప్తాడు. మీరు ఎప్పటికైనా గొప్పవారు అవుతారని అతను కళ్యాణ్ తో అనగానే.. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. నా కొడుకు రోడ్డుపై తిరుగుతుంటే.. నువ్వు మాత్రం మహారాజులాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. నీ కొడుకు అవన్నీ అనుభవిస్తానంటే.. ఎవరైనా వద్దని చెప్పారా ఇంటికి రమ్మనంటే రావడం లేదు కదా అని అపర్ణ అంటుంది. ఏమైంది నీకు ఈ రుద్రాణి బయటకు వెళ్లి ఇవన్నీ నేర్పి తీసుకొని వచ్చిందా అని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత నా కొడుకుకి న్యాయం కావాలని ధాన్యలక్ష్మి అంటుంది. వాడిని తీసుకొని రా నేనే న్యాయం జరిపిస్తానని సుభాష్ అంటాడు. ఈ ఆస్తిని ముక్కలు చెయ్యండి. మీ వాటా మీరు తీసుకొని.. మా వాటా మాకు ఇవ్వండి కళ్యాణ్ కి ఇస్తానని ధాన్యలక్ష్మి అనగానే.. ఏమంటున్నావ్ ఇది తరతరాలుగా వస్తున్న ఉమ్మడి ఆస్తి. దీన్ని ముక్కలు చెయ్యడం ఏంటి? దీన్ని అనుభవిచండమే కానీ అమ్మడం జరగదులు.. పంచడం జరగదని ఇందిరాదేవి కోప్పడుతుంది. నీకు ఎంత దైర్యమంటు ధాన్యలక్ష్మిని ప్రకాష్ కొట్టబోతుంటే.. సుభాష్ ఆపుతాడు. నేను అన్న దాంట్లో తప్పేంటి? నీలాగే మీ కొడుకు కూడా బ్రతకాలా అని ధాన్యలక్ష్మి అంటుంది.
అ తర్వాత సీతారామయ్య వచ్చి ఈ ఆస్తులు ముక్కలు చేయడం ఉండదు. నీ బాధ నాకు అర్థమైంది. కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేవరకు రాజ్ ఆఫీస్ బాధ్యతల నుండి.. తప్పుకుంటాడని సీతారామయ్య అనగానే అందరు షాక్ అవుతారు. అ తర్వాత మీ నిర్ణయం తప్పు అని నేను అనుకుంటున్నాను. ఆఫీస్ లో బాధ్యతలు తీసుకోకుండా ఉంటే కంపెనీ నష్టపోతుందని కావ్య అనగానే.. తాతయ్య నిర్ణయానికి అడ్డు చెప్తావా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కళ్యాణ్ రాడు వచ్చేలా లేడు.. అప్పటివరకు కంపెనీ పరిస్థితి ఏంటని కావ్య అడుగుతుంది. ఏంటి నీకు ఆస్తులపై మోజు పెరిగిందా అందుకేనా కళ్యాణ్ రావడం వద్దని అంటున్నావని రాజ్ అనగానే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.