English | Telugu

అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు.. రసగుల్లా తింటూ సంబరాలు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1156 లో.. మను తన కన్న తండ్రి మహేంద్ర అన్న విషయం తెలుసుకొని ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదని కోపంగా ఉంటాడు. మహేంద్ర సర్ అందుకేనా అంతా తెలిసి నన్ను, కొడుకులా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. దత్తత తీసుకుంటానని అంది అందుకేనా అని మను కోపంగా ఉంటాడు. కోపంలో గన్ ని పైకి షూట్ చేస్తాడు. వాళ్లు ఎలా ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఉన్నారో నాకు తెలుసన్న విషయం వాళ్లకు చెప్పకుండా.. ఎలా ఉండాలో అలా ఉంటానని మను అనుకుంటాడు.

అ తర్వాత వసుధార, రిషి వస్తుంటే.. సరోజ, ధనరాజ్ లు అడ్డుపడతారు. బావ నాతో పాటు ఊరుకి రా ఇది నిన్ను పూర్తిగా మార్చేసింది బావ అని సరోజ అనగానే.. ఇప్పుడు నేను రాలేను ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోమని రిషి అంటాడు. అలా అంటావేంటి బావ అని సరోజ అంటుంది. ఇక్కడికి రావడానికి కారణం మీ నాన్న అతనే నన్ను పంపించాడు. వసుధారని ఏం అనకు.. నువు ముందు ఊరు వెళ్ళమని రిషి చెప్పగానే సరోజ వెళ్లిపోతుంది. మరొకవైపు మను చాలా హ్యాపీగా అనుపమ దగ్గరకి వచ్చి గ్రానీ ఎక్కడ అని అడుగుతాడు. ఇంట్లో లేదని అనుపమ చెప్పగానే.. నాకు ఇప్పుడు స్వీట్ తినాలని ఉంది చేస్తావా అని అంటాడు. చేస్తానని అనుపమ అనగానే నీకెందుకు శ్రమ ఆర్డర్ పెడతానని మను రసగుల్ల ఆర్డర్ పెడుతాడు. నాన్నకి ఏ స్వీట్ అంటే ఇష్టం అమ్మ.. ఎలాగో నాన్న ఎవరో చెప్పవు.. కనీసం తన ఇష్టాలన్నా చెప్పాలి కదా అంటూ మను వింతగా మాట్లాడుతుంటే.. ఏంటి తన కన్నతండ్రి ఎవరో తెలిసిపోయిందా అని అనుపమ అనుకుంటుంది. అ తర్వాత ఆర్డర్ చేసిన స్వీట్ వస్తుంది. దాని తింటూ కూడా ఇండైరెక్ట్ గా మహేంద్ర గురించి మను మాట్లాడతాడు. తన మాటలకి అనుపమకి భయం వేస్తుంది.

మరొకవైపు మహేంద్ర చాలా హ్యాపీగా ఉంటూ రసగుల్ల తింటుంటాడు. ఎందుకు మావయ్య ఇంత హ్యాపీగా ఉన్నారని వసుధార అడుగుతుంది. ఈ రోజు రిషి ఎండీ అయ్యాడు కదా అందుకే అని మహేంద్ర అంటాడు. మరొకవైపు ఎండీ పదవి దక్కలేదని శైలేంద్ర బాధపడుతుంటే ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదని దేవయాని తిడుతుంది. అప్పుడే ధరణి వస్తుంది. తనతో శైలేంద్ర బాధని చెప్పుకుంటాడు. ఎండీ అవ్వాలనుకున్నాను కానీ అ మను గాడి వల్ల ఇలా అయిందని అనగానే మను వల్ల ఇలా అయిందా అని ధరణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.