English | Telugu
అనసూయను టార్గెట్ చేసిన రష్మీ...
Updated : Aug 17, 2024
రష్మీతో చిట్ చాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆడియన్స్ కానీ ఫాన్స్ కానీ రష్మీ-సుధీర్ జోడిని బాగా ఇష్టపడతారు. కానీ ఈ చిట్ చాట్ లో మాత్రం రష్మీ సుధీర్ ప్రస్తావన తేకుండా కాన్వెర్జేషన్ అంతా ప్రదీప్, అనసూయ గురించే మాట్లాడింది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేయడం కోసమే అనసూయను టార్గెట్ చేసి పంపేశారని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని అడిగేసరికి "అలా చేయలేదు. ఆమె తన ఫిలిమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పారు కూడా. ఎవరి ఎవరినో టార్గెట్ చేసి పంపేయడానికి ఇదేమన్నా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమా" అని కామెడీ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది "సినిమాల్లో నాకు మంచి రోల్స్ రాకపోవడానికి కారణం లక్ లేకపోవడం.
ఇదంతా లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక యాంకరింగ్లో తనకు పదికి పది మార్కులు ఇచ్చుకుంది శ్రీముఖి, అనసూయకు తొమ్మిదిన్నర మార్కులు ఇచ్చింది. నాకు ప్రదీప్ తో పెయిర్ గా చేయడం ఇష్టం ఏ వయసు వాళ్ళనైనా నవ్విస్తాడు. ప్రదీప్ తో ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుంది. ఆల్ రౌండర్ అతను... ఆన్ కెమెరా కానీ ఆఫ్ కెమెరా కానీ జోక్స్ ఎక్కువగా వేసేది ఆటో రాంప్రసాద్. బాగా విసిగించేది ఆది. ఇక కామెడీ షోస్ కి రోజా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్. ఆమెలో కూడా ఆమెకే తెలీని కామెడీ టైమింగ్ ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారి జడ్జ్మెంట్ బాగుంటుంది. కొట్టాలంటే ఆదిని కొడతా, ముద్దు పెట్టాలంటే ప్రదీప్ కి ముద్దిస్తా, సుధీర్ కి వార్నింగ్ ఇస్తా. అలాగే పార్టీకి వెళ్లాలంటే డిజె టిల్లుతో వెళ్తా, ట్రిప్ ప్రదీప్ తో , షాపింగ్ సుధీర్ తో వెళ్తా. " అంటూ ఇంటరెస్టింగ్ గా చిట్ చాట్ చేసింది రష్మీ.