English | Telugu
నేహా మళ్ళీ యాక్టివ్ అయ్యింది...డాన్స్ చేస్తోంది
Updated : Aug 9, 2024
నేహా చౌదరి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. నేహా ఆట తీరు, అందం, మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వతో కలిసి నీతోనే డ్యాన్స్ 2.0లో కంటెస్ట్ చేసింది. ఏ జోడి మంచి మంచి డ్యాన్స్ లతో అలరించింది. ఐతే నేహా ఆ షో నుంచి బయటికి వచ్చేసింది. మెడకు పెద్ద బ్యాండేజ్ తో ఆమె స్టేజ్ పైకి వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మెడ దగ్గర దెబ్బ తగలడంతో ఎంఆర్ ఐ తీయించి చెక్ చేయిస్తే పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఇక నేహా అన్నీ ఆపేసింది.
ఏప్రిల్ లో ఈ షో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ ఐనట్టే కనిపిస్తోంది నేహా. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ గా ఒక ట్రెండింగ్ సాంగ్ వీడియోకి డాన్స్ చేస్తూ కనిపించింది. చాలా రోజుల తర్వాత లాంగ్ రికవరీ తర్వాత డాన్స్ చేస్తున్నాను అట్లీస్ట్ ట్రై చేస్తున్నా అని కామెంట్ పెట్టుకుంది నేహా. ఐతే నెటిజన్స్ కూడా నేహా మెడ, కాలు ఎలా ఉంది అని అడుగుతున్నారు. డాన్స్ చాలా బాగా చేస్తున్నారని కితాబిస్తున్నారు. నీతోనే డ్యాన్స్ 2.0లో నుంచి వెళ్లిపోయేటప్పుడు చాలా బాధతో వెళ్తూనే వచ్చే సీజన్ లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పింది. దానికి స్టార్ మా వాళ్లు కూడా ఒప్పుకున్నారు అని కూడా చెప్పింది నేహా. వచ్చే సీజన్ లో ఇంకా స్ట్రాంగ్ గా, బాగా చేస్తాను అన్న నేహా కోసం అలాగే నెక్స్ట్ సీజన్ నీతోనే డాన్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.