English | Telugu

Brahmamudi : అప్పు మనసులో కళ్యాణ్.. అనుకున్నది సాధించిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో.. నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని కావ్యని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అసలు అది నీకెందుకు మాట ఇవ్వాలని స్వప్న కోప్పడుతుంది. ఏమో మీరు ఇద్దరు ఎలా ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు.. అందరి ఇష్టప్రకారమే కోడళ్ళు అయ్యారా అని రుద్రాణి అంటుంది‌. దాంతో స్వప్న కోప్పడుతుంది. మా అమ్మని ఏమైనా అంటే కొడుతానని రాహుల్ అనగానే.. మరి మా అమ్మని ఏమైనా అంటే నేను ఎలా ఊరుకుంటానని స్వప్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ మీ అమ్మ గారు చెప్పిన సంబంధం చేసుకుంటేనే ఈ నోళ్లు మూతపడతాయని కావ్య అంటుంది. ఇంకేంటి ఒప్పుకో అని రాజ్ వెటకారంగా మాట్లాడుతాడు. అనామిక చేసిన గాయం మానలేదు. అప్పుడే పెళ్లికి సిద్ధం గా లేనని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు.

అర్థం అయిందా ఇంకెప్పుడు కళ్యాణ్ విషయంలో కావ్యని ఏం అనొద్దంటూ ఇందిరాదేవి, అపర్ణ లు ధాన్యలక్ష్మికి చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరకి రాజ్ వచ్చి.. అందరిముందు ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. నేను అప్పుని కలిసాను.. తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను కానీ తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందని చెప్పాక నేనేం చెప్పలేదు. అయిన అప్పు అంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.. పెళ్లి చేసుకున్నాకా తనని మాటలు అంటే తను బాధపడుతుంది. నా పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పు ప్రేమ తెలిసింది. ఇప్పుడు అప్పు పెళ్లి జరుగుతుంటే.. నా ప్రేమ తెలిసిందని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని రాజ్.. లేదని కావ్యలు వాదిస్తారు. అప్పు మనసులో నిజంగా కళ్యాణ్ ఉంటే మీతో పాటు వాళ్ళ పెళ్లి చెయ్యడానికి నేను రెడీ.. ముందు అప్పుని కనుక్కోండి అని కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. అదంతా విన్న రుద్రాణి.. కనకానికి ఫోన్ చేసి అప్పుని ఈ ఇంటికి కోడలు చెయ్యడనికి ప్లాన్ బాగానే వేసావ్.. ఏకంగా రాజ్ నే ఇంటికి వచ్చేలా చేసావంటూ కనకాన్ని ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంది.

ఆ తర్వాత రాజ్ కనకం ఇంటికి వచ్చి.. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇప్పుడు ఇలా మాట్లాడకండి.. అప్పు ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందని కనకం కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అప్పు కూడా నా ఇష్టప్రకారం పెళ్లి జరుగుతుందని చెప్తుంది. మీకు మీరే మోసం చేసుకుంటన్నారని రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్తాడు. వీళ్ళందరు మీ కోసం ఎదరు చూస్తున్నారు.. అక్కడ ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో బంటి అప్పు దగ్గరికి వచ్చి.. కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అయిందని చెప్తాడు. దాంతో అప్పు హాస్పిటల్ కి వెళ్తుంది. నేను కళ్యాణ్ ని చూడాలని రాజ్ తో అప్పు అనగానే.. ఎందుకు నువ్వు ఏమైనా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావా? వాడి గురించి నీకెందుకని రాజ్ అనగానే.. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని అప్పు అంటుంది. ఆ మాట పక్కనే చాటుగా ఉండి కళ్యాణ్ వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.