English | Telugu
Brahmamudi : రాజభోగాలు అనుభవించాల్సింది నా కొడుకే.. ధాన్యలక్ష్మి చేసిన రభస!
Updated : Aug 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో... కళ్యాణ్, అప్పులని తీసుకొని రాకుండా రాజ్ ఒక్కడే వస్తాడు. దాంతో ఏమైంది రానని చెప్పాడా? ఎందుకు రాను అన్నాడని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుని మా అమ్మ కోడలుగా ఒప్పుకుందా అని అడిగాడు. నాకు పిన్ని అ విషయం గురించి ఏం చెప్పలేదు.. నేను కళ్యాణ్ కి ఏం చెప్పలేదు.. అప్పుని కోడలుగా ఒప్పుకొని తనే స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తే వస్తానని కళ్యాణ్ అన్నాడని రాజ్ చెప్పగానే.. అంటే ధాన్యలక్ష్మి వెళ్లి అప్పు కాళ్ళు పట్టుకొని రా మహాలక్ష్మి అంటూ పిలవాలా అని రుద్రాణి అంటుంది.
అలా తను అనడంతో అందరు రుద్రాణిపై కోప్పడతారు. ఇద్దరు అక్కల కంటే అప్పు ముదురు.. కళ్యాణ్ ని కొంగున కట్టేసుకొని ఆడిస్తుందని రుద్రాణి అనగానే.. మీ అబ్బాయి ఏమైనా నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని స్వప్న అంటుంది. కావ్యని నేను పెళ్లి చేసుకోవడం వల్ల.. కావ్యని కొన్ని రోజుల వరకు అమ్మ కోడలుగా ఒప్పుకోలేదు. దాంతో కావ్య చాలా కష్టాలు పడింది. ఇప్పుడు కూడా నేను అప్పుని తీసుకోని వస్తే అదే జరుగుతుందని కళ్యాణ్ అన్నాడంటూ రాజ్ చెప్తాడు. ఈ ఆస్తులన్నీ మన వారసులకి కాదు.. కనకం కన్నబిడ్డలకి ధారపోయడానికి అని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ తన కవితలకు సంబంధించిన జాబ్ ని సెర్చ్ చేస్తుంటాడు. ఎక్కడ ఖాళీ లేదని చెప్పడంతో ఒక దగ్గర వచ్చి కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక పెద్దాయన బొమ్మలు అమ్ముకుంటు నీరసంగా వచ్చి కూర్చొని ఉంటే.. నేను అమ్మి పెడతానని కళ్యాణ్ అమ్ముతుంటాడు. అప్పుడే రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కళ్యాణ్ ని చూస్తారు.
అది చూసి ధాన్యలక్ష్మి బాధాపడుతుంటే.. రుద్రాణి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నీ కొడుకు ఇలా ఉంటే రాజ్ మాత్రం రాజాభోగాలు అనుభవిస్తున్నాడు.. నువ్వు వెళ్లి ఇంట్లో నీలదియ్యాలని ధాన్యలక్ష్మికి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ హెల్ప్ చేసినందుకు.. అ పెద్దాయన థాంక్స్ చెప్తాడు. మరొక వైపు ఎప్పటిలాగా రాజ్ వచ్చి కావ్యతో గొడవపడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ రాసిన పుస్తకం బయట ఒకతను అమ్ముతూ కన్పిస్తాడు. తరువాయి భాగంలో. రాజ్ ఆఫీస్ కీ వెళ్తుంటే.. కళ్యాణ్ అన్ని కష్టాలు పడుతున్నాడు. రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు.. ఈ ఆస్తులు ముక్కలు చెయ్యాలని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో కళ్యాణ్ వచ్చే వరకు రాజ్ ఇంటి బాధ్యతల నుండి తప్పుకుంటాడని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.