English | Telugu
గుప్పెడంత మనసు..పార్ట్ 2 త్వరలో..
Updated : Aug 16, 2024
బుల్లితెర మీద కార్తీక దీపం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత గుప్పెడంత మనసు కూడా అదే రేంజ్ మంచి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ అలా తన వైపు తిప్పేసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ సీరియల్ ని ముగించేస్తున్నారు సీరియల్ మేకర్స్. దీంతో ఆడియన్స్ మాత్రం బాగా ఫీలవుతున్నారు. ఈ టీమ్ మొత్తం వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేయడం అలాగే కట్ చేసి తినిపించుకోవడం చూసాక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అని నమ్మారు ఆడియన్స్. ఇక ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. కార్తీక దీపం ఎలా ఐతే పార్ట్ 2 తో వచ్చిందో అలాగే గుప్పెడంత మనసు కూడా పార్ట్ 2 తో రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ ఫాన్స్.. "ప్లీజ్ డైరెక్టర్ గుప్పెడంత మనసు పార్ట్ 2 రావాలి. హీరొ గోల్ , హీరోయిన్ గోల్ చూపించకుండానే ఆపేస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద మాకు సీరియల్ కావాలి. కేక్ కటింగ్ టైములో మీరు అన్నారు కదా పార్ట్ 2 చేద్దాం అని. ఆ మాట నిలబెట్టుకోండి.
ఫ్యాన్స్ వెయిటింగ్ పార్ట్ 2 చూడడానికి. ఎన్నో పనికిమాలిన సీరియల్స్ ఉన్నాయి. ఎండ్ చేయమన్నా చెయ్యట్లేదు. ఈ గుప్పెడంత మనసులో తల్లి, తండ్రితో కొడుకుకు ఉన్న బంధం ఎంతో బాగా చూపించారు. ఎన్ని సంవత్సరాలు ఈ సీరియల్ ప్రసారమైన కూడా చూసేవాళ్ళం...సీరియల్ అప్పుడే ఇపోతోందంటే బాధగా ఉంది. ప్లీజ్ ఎండ్ చేయకండి" అంటూ నెటిజన్స్ తెగ మెసేజెస్ పెడుతున్నారు. మరి ఈ సీరియల్ మేకర్స్ కూడా అభిమానుల కోరిక మేరకు గుప్పెడంత మనసు పార్ట్ 2 ని తీసుకొస్తారేమో చూడాలి.