English | Telugu
Ramu Rathod: తనూజ కాళ్ళు మొక్కిన రాము రాథోడ్. . గౌరవ్ కోసమేనా!
Updated : Nov 3, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. ఫేక్ బాండింగ్స్ ఎక్కువయ్యాయి.. వాటిని తీసేయడానికే వెళ్తున్నాని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది మాధురి. అయితే తనే తనూజతో బాండింగ్ ఏర్పరుచుకుంది.
ఇక ఎలిమినేషన్ జరిగే కొంచెం ముందు ఇచ్చిన బ్రేక్ టైమ్‌లో తనూజ దగ్గరికి రాము వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. ప్లీజ్ అక్కా నీకు దండం పెడతా.. నా వల్ల ఒకరి లైఫ్ పాడైపోతుందంటూ తనూజని రిక్వె్స్ట్ చేశాడు రాము. నిజానికి రాము ఇంతగా తనూజని బతిమాలింది గౌరవ్ కోసం. ఎందుకంటే గౌరవ్‌ని రాము నామినేట్ చేసాడు. చాలా సిల్లీ రీజన్‌తో గౌరవ్ ని రాము సేఫ్ నామినేషన్ చేశాడు. ఇక తన వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమోనని రాము భయపడ్డాడు. దీంతో తనూజని తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేయొద్దంటూ రాము రిక్వెస్ట్ చేశాడు. నీకు దండం పెడతా అక్కా అని రాము అడిగితే నేను కూడా నీకు దండం పెడతారా.. ఎలారా రామ్ ఇది గేమ్.. చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్.. నేను ఆలోచిస్తా రామ్ అని తనూజ చెప్పింది.
కూర్చో అక్కా ప్లీజ్ అంటూ రాము మళ్లీ బ్రతిమాలుతూనే ఉన్నాడు. దీంతో రామ్ ఒక్కటే రిక్వెస్ట్ నా గేమ్ నన్ను ఆడనివ్వు అని తనూజ అంది. నీకు నేను సపోర్ట్ చేస్తా అక్కా.. అని రాము అంటే నాకెవరి సపోర్ట్ వద్దంటున్నాను అయినా మాటల్లో చెప్పడం వేరు చేతల్లో చూపించడం వేరు.. కానీ నేను ఆలోచిస్తానని తనూజ చెప్పింది. ఎలిమినేషన్ రౌండ్ లో భాగంగా మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్లకి గంతలు కట్టి కారులో ఎక్కించారు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాధురి ఎలిమినేషన్ అని డిస్ ప్లే లో చూపించాడు నాగార్జున. ఇక తనూజని గోల్డెన్ బజర్ పవర్ ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగగా లేదని తనూజ చెప్పడంతో మాధురి ఎలిమినేషన్ అయింది .. గౌరవ్ కార్ లో లోపలికి వచ్చాడు. ఇక గౌరవ్ ని చూసి రాము ఎమోషనల్ అయ్యాడు. ఎక్కడ తను బయటకు పోతాడేమోనని రాము ఫుల్ టెన్షన్ పడ్డాడు. అయితే తనూజ కాళ్లు మొక్కడం కరెక్ట్ కాదని రాముని ఆడియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.