English | Telugu
తనూజకి ఫేక్ ఓటింగ్.. జెన్యున్ ప్లేయర్స్ కి అన్యాయం జరుగుతుందా!
Updated : Nov 3, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు ఎనిమిది వారాలు గడిచాయి. ఇక ఈ ఎనిమిది వారాల్లో ప్రియా, ఫ్లోరా సైనీ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, రమ్య మోక్ష, అయేషా, శ్రీజ ఎలిమినేషన్ అయ్యారు. అయితే భరణి ఎలిమినేషన్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు జరిగిన ప్రతీ నామినేషన్లో తనూజ దాదాపుగా ఉంది. అయితే తను హౌస్ లో ఎక్కువ టైమ్ కిచెన్ లో ఉంటుంది. అయితే తన బిహేవియర్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే తినే ఫుడ్ ని చిరాకుగా సర్వ్ చేయడం ఎవరిది నచ్చదు.. అందుకే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా తనని ఇదే పాయింట్ మీద నామినేషన్ చేశాడు. ఇక తనూజ చిరాకుకి సంజన, మాధురి, రాము, ఇమ్మాన్యుయల్ ఇలా చాలామంది బలయ్యారు కానీ ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే తనూజ గేమ్ ఆడినా ఆడకపోయిన తనకి మాత్రం ఓటింగ్ భారీగానే ఉంది. అయితే తనకి పడే ఓటింగ్ అంతా ఫేక్ అని, పీఆర్ లు డూప్లికేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎంతలా అంటే తనూజకి ప్రతీ నామినేషన్ లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత కళ్యాణ్ కి ఇరవై నుండి ముప్పై శాతం ఓటింగ్ పడుతోంది. అయితే హౌస్ లో జెన్యున్ గా ఆడే డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, దివ్య, భరణి లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది.
ఇప్పటివరకు జరిగిన అన్నీ ఎపిసోడ్ లలో చాలా కాన్ఫిడెంట్ గా జెన్యున్ గా ఆడే వాళ్ళ లిస్ట్ లో సుమన్ శెట్టి నెంబర్ వన్ ఉండగా ఆ తర్వాత దివ్య ఉంది. ఇక మూడో స్థానంలో భరణి ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉన్నారు. అయితే వీళ్ళు నామినేషన్ లోకి వచ్చినా వీరికంటే ఎక్కువగా తనూజ, కళ్యాణ్ లకి ఓటింగ్ పడుతోంది. అయితే వీళ్ళిద్దరు ఆడి గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు. పైగా కంటెంట్ కూడా ఏం ఇవ్వలేరు. కానీ ఓటింగ్ మాత్రం గట్టిగా పడుతోంది. అంటే ఇదంతా ఫేక్ ఓటింగ్ అని ఆడియన్స్ కి అర్థమైంది. అయితే తనూజ, కళ్యాణ్ లలో ఎవరో ఒకరిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేశాడనిపిస్తుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.