English | Telugu

దుమ్ములేపుతున్న ప్రేరణ.. చెత్త పర్ఫామెన్స్ తో యష్మీ!

బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. మెగా చీఫ్ కంటెండర్ కోసం జరిగే టాస్క్ లో భాగంగా పృథ్వీ, విష్ణుప్రియ మధ్య టాస్క్ ఉంది. అందులో పృథ్వీ స్ట్రాటజీ ప్లే చేసి విన్ అయి పృథ్వీ కంటెండర్ షిప్ ని పదిలపరుచుకుంటాడు. అంతేకాకుండా ఆరెంజ్ కలర్ సూట్ కేసుని విష్ణుప్రియకి ఇస్తాడు పృథ్వీ. దాంతో తను కూడా కంటెండర్ అవుతుంది. అయితే ప్రేరణ, విష్ణుప్రియ, యష్మీ లు ఆరెంజ్ సూట్ కేసు పొంది మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు.

ఇప్పుడే అసలు బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టాడు. నబీల్, రోహిణి, పృథ్వీ లు సూట్ కేసు తీసుకోవడంతో కంటెండర్స్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు గెలిచి నబీల్, రోహిణి, పృథ్వీ ముగ్గురు కంటెండర్ షిప్ పదిలపరుచుకున్నారు. అయితే మళ్ళీ ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియలకి తమ కంటెండర్ షిప్ ని పదిలపరుచుకోవడానికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. బరువు గల బ్యాగ్ తో పూల్ నుండి వచ్చి టేబుల్ లో పడెయ్యాలి. అందులో విష్ణుప్రియ, ప్రేరణ పోటీపడి ఆడుతారు.

యష్మీ మాత్రం స్లోగా ఆడుతుంది. అసలు తను ఎక్కువగా ట్రై కూడా చెయ్యలేదు. మిగతా ఇద్దరరు మూడు, నాలుగు బ్యాగ్ లు వేస్తుంటే యష్మీ ఒక్క బ్యాగ్ కూడా వేయదు. అది బజర్ టైమ్ కి‌ ఒక్క బ్యాగ్ వేసింది. ఈ లెక్కన యష్మీ నామినేషన్ లో ఉన్నంత ఊపు.. టాస్క్ కి వచ్చేసరికి కన్పించడం లేదు. అంతకు ముందు నేను వీక్ క.టెస్టెంట్ అనుకుంటున్నారు. నేను ఏంటో చూపిస్తానని ప్రేరణతో యష్మీ చెప్పింది. తీరా ఆట మొదలయ్యాక తెలిసింది యష్మీ జీరో అని.. ఇక టాస్క్ ముగిసాక కూడా నేను కూడా బాగా అంటుంది. ఏంటంటే యష్మీ నామినేషన్లో పులి.. టాస్క్ లో పిల్లి అని మనకి తెలుస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.