English | Telugu
Bigg Boss 9 Telugu:ఇమ్మాన్యుయేల్ కు సేఫ్టీ కార్డు.. రీతూపై దివ్య ఫైర్!
Updated : Nov 5, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హౌస్ లో ఓ టెలిఫోన్ పెట్టి హౌస్ లోని వాళ్ళకి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు. ఇందులో భాగంగా సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా ఉండి వారి టాస్క్ పూర్తి చేశారు. ఆ తర్వాత హౌస్ ని బ్లూ టీమ్, పింక్ టీమ్, ఆరెంజ్ టీమ్ అని మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్.
మూడు టీమ్ లకి తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా సీసాని మోకాలితో బ్యాలెన్స్ చేస్తూ డంబుల్స్‌తో అవతలి సైడ టవర్ ఏర్పాటు చేయాలి. అలా ఎవరు ముందు పూర్తి చేస్తారో వాళ్లు విన్. ఈ టాస్కు ఆడేందుకు ఆరెంజ్ టీమ్ నుంచి రాము రాథోడ్, ఇమ్నాన్యుయల్ వచ్చారు. బ్లూ నుంచి డీమాన్ పవన్, నిఖిల్ వచ్చారు. పింక్ టీమ్ నుండి దివ్య, సాయి శ్రీనివాస్ ఆడటానికి వచ్చారు. ఈ టాస్కులో రాము,ఇమ్మాన్యుయేల్ గెలిచారు. దీంతో ఈ టీమ్‌కి సేఫ్టీ కార్డ్ పంపించాడు బిగ్‌బాస్. ఆరెంజ్ టీమ్ అంతా ఆలోచించి చివరికి ఆ సేఫ్టీ కార్డుని ఇమ్మాన్యుయల్ కి ఇచ్చారు.
ఆ తర్వాత అందరు భోజనానికి వెళ్ళారు. డీమాన్ భోజనం తింటుంటే రీతూ వచ్చి కూర్చుంది. దీంతో డీమాన్ ఒక ముద్ద తినిపించాడు. ఇది చూసి ఏయ్..నీకేమైందిరా తినడానికి అని దివ్య అంది. చెయ్యి మంటెక్కుతుందంటూ డీమాన్ సరదాగా అన్నాడు. ఎక్కడా ఎలా చూపించమని దివ్య అడిగింది. దీంతో బాబూ ఇయ్ చేయమని చెప్పలేదు.. ఓన్లీ మాట్లాడకుండా చూడమన్నారని డీమాన్ ఫైర్ అయ్యాడు. ఎందుకింత దగ్గరగా ఉండడం.. ఈ కంటెంట్ కూడా ఇస్తారా.. వీకెండ్‌లో నాకు ఈ క్లిప్ చూపించి దివ్య ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్పాలి నేను అంటూ దివ్య అరిచింది. ఒక్క నిమిషం నాకు అర్థం కావడం లేదు దివ్య.. మాట్లాడుకోవద్దని చెప్పారని రీతూ అంది. సరే రీతూ చేసుకోండని దివ్య అంది. తినేటప్పుడు ప్లీజ్ గొడవద్దు.. ఇప్పుడు తినిపిస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటూ రీతూ అంది. మాట్లాడుకోవద్దంటే ఇవన్నీ కూడా చేయొద్దనే.. ఒకరి దగ్గర ఒకరు ఉండొద్దనే.. కుకింగ్ విషయం తప్ప.. అది సింపుల్ లాజిక్ పవన్.. దీంట్లో కూడా లూప్ హోల్స్ వెత్తుకుంటానంటే నేనేం చేయలేనంటూ దివ్య సీరియస్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి బ్రతిమిలాడితే తనతో కూడా గొడవ పెట్టుకుంది రీతూ.