English | Telugu

Bigg Boss 9 Telugu: సుమన్ శెట్టి రెబల్.. ఇరగదీశాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో‌ సుమన్ శెట్టి ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం సుమన్ శెట్టినే కంటెంట్ ఇచ్చాడు. అతని ఆటకి దివ్య తోడైంది. ఇద్దరు కలిసి టాస్క్ ని పూర్తి చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో అందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా ఒక మూల టెలిఫోన్ చూసి హౌస్‌మేట్స్ అవాక్కయ్యారు. వెంటనే తనూజ వెళ్లి ఇంట్లో నుంచి మనకి ఫోన్స్ వస్తాయేమోనంటూ గెంతులేసింది. ఇక ఫోన్ రింగ్ అవ్వగానే తనూజనే లిఫ్ట్ చేసింది. అయితే తీరా అది బిగ్‌బాస్ మాట్లాడటానికే పెట్టాడు. తనూజ.. మీ చుట్టూ ఉన్న వాళ్లందరూ మన మాటలు వింటున్నారు.. వాళ్లందరినీ దూరంగా వెళ్లమనండి.. నేను మీకు ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారని బిగ్‌బాస్ అడిగాడు. బిగ్‌బాస్ మీరు అడిగారు కదా మీ విషెస్ ఏమైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని దాని గురించి అయి ఉంటుందని అనుకుంటున్నానని తనూజ చెప్పింది. లేదు మీరు తప్పు గెస్ చేశారు.. ఇప్పటినుంచి కంటెండర్‌షిప్ టాస్క్ మొదలైంది.. ఈ విషయాన్ని అందరికి చెప్పండని బిగ్‌బాస్ అన్నాడు. ఈ విషయం తర్వాత హౌస్‌మేట్స్‌ కి చెప్పినా వాళ్లు పెద్దగా నమ్మలేదు. ఇదేదో సీక్రెట్ టాస్క్ అనుకున్నారు. కాసేపటి తర్వాత రీతూతో కూడా ఫోన్‌లో మాట్లాడాడు బిగ్‌బాస్. నెక్స్ట్ రూల్స్ చెప్పాడు.

ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్‌ మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరం. కానీ హౌస్ మేట్స్ అందరి మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు.. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.. వారి నుంచి తప్పించుకొని ఆటలో కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారం మీకు కొన్ని ఛాలెంజస్ ఇస్తాను.. మీరు ఆ ఛాలెంజస్‌లో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారు.. ఏ టీమ్ అయితే ఆ సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీమ్ తమ సభ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగలుగుతారు.. కానీ ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకూ మాత్రమే ఉంటుంది.. ఆ తరువాత నేను తదుపరి ఛాలెంజస్‌లో గెలిచే టీమ్‌కి ఆ సేఫ్టీ కార్డ్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ బదిలీ అవుతుంటుంది.. మీ మధ్య ఉన్న రెబల్‌ని గుర్తించి కేవలం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే రెబల్ ఎవరనేది చెప్పాలి.. అప్పటివరకూ అప్రమత్తంగా ఉండండి అంటూ అందరికి బిగ్‍‌బాస్ చెప్పాడు.

ఒక్కొక్కరితో ఫోన్‌లో మాట్లాడాడు బిగ్ బాస్. ఆ తర్వాత సుమన్ శెట్టి రాగానే రెబల్ మీరే సుమన్.. చిట్స్ ద్వారా మీకు కొన్ని సీక్రెట్ టాస్కులు ఇస్తాను.. వాటిలో ఎక్కువ టాస్కులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీరు కంటెండర్ అవుతారు.. అలానే మీరు సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన ప్రతిసారీ ఒకరిని మీరు ఈ కంటెండర్ రేసు నుంచి ఎలిమినేటర్ చేసే పవర్ లభిస్తుంది.. ఒకవేళ మీరు పట్టుబడితే కంటెండర్ షిప్ రేసు నుంచి మీరు తొలగిపోతారు.. మొదటి సీక్రెట్ టాస్క్ చిట్ బాత్రూంలోని వాష్ బేసిన్ కింద కేబినెట్‌లో అతికించి ఉంది.. ఆ స్లిప్ ఎవరు చూడనప్పుడు తీసుకొని టాస్క్‌ని విజయంవంతంగా పూర్తి చేయండి.. అని సుమన్ చెప్పాడు. దీంతో వాష్‌రూమ్ ఏరియా దగ్గరికెళ్లి ఆ స్లిప్‌ని సంపాదించాడు సుమన్. ఆ తర్వాత దివ్యకి రెండో రెబల్ అని, సుమన్ శెట్టి టాస్క్ ని ఇద్దరు ఫినిష్ చేయాలని చెప్పగా ఇద్దరు ఫినిష్ చేశారు.