English | Telugu

లక్ష గెలిచిన కాంతారా టీమ్.. నిఖిల్ టీమ్ నుండి మణికంఠ అవుట్!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. అయితే వైల్ట్ కార్డ్ ఎంట్రీలు.. హౌస్ లోకి రాకుండా ఆపే టాస్క్ లు‌ ఇవి.‌ మరి టాస్క్ లో‌ ఎవరు‌ గెలిచారో చూసేద్దాం. మొదటి టాస్కు 'బాల్ ని పట్టు టవర్ లో పెట్టు'.. ఇందులో మొదటగా నిఖిల్ అండ్ నబీల్ ఆడారు. ఆ తర్వాత ఇరు టీమ్ ల నుండి ఒక్కొక్కరుగా వచ్చి బాల్స్ ని వేయగా.. మొదటగా కాంతారా టీమ్ గెలిచింది. ఆ తర్వాత పన్నెండో నెంబర్ వైల్డ్ కార్డ్ ని తీసేసి కాంతారా ఫ్లకార్డ్ ని పెట్టేశారు.

ఇక ఈ టాస్క్ లో శక్తి టీమ్ ఓడిపోవడంతో నిఖిల్‌ను తన క్లాన్‌ నుంచి ఒక సభ్యుడిని తీసేయాలని బిగ్‌బాస్ కోరాడు. దీంతో అందరూ ఆలోచించుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. అయితే ఇది కేవలం తర్వాతి టాస్కు వరకే కదు ఈ వారం మొత్తం మణికంఠ.. నిఖిల్ క్లాన్‌కి దూరంగా ఉండాలి. అలానే హౌస్‌లో ఏ టాస్కులోనూ పార్టిసిపేట్ చేయకూడదు. ఇలా మొత్తానికి అందరూ కూడబలుక్కొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. ముఖ్యంగా యష్మీ, పృథ్వీ అస్తమానం మణికంఠ ఫిజికల్‌గా వీక్ అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చెప్పి టాస్కుల నుంచి మణికంఠను కూర్చోబెట్టేశారు.

ఇక ఆ తర్వాత ' ఈట్ ఇట్ అండ్‌ బీట్ ఇట్' సెకెండ్ టాస్క్ గా ఫుడ్ పంపించాడు బిగ్ బాస్. అదే 'మహా తాలి'. బిర్యానీ, చికెన్ ఫ్రై, పరోట ఇలా అన్నీ నాన్ వెజ్ కలిపి దాదాపు అయిదారుగురు తినే ఫుడ్ ని ఒకరు కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ కోరాడు.‌ఇక ఇరు టీమ్ ల నుండి ఎవరొస్తారని అడుగగా.. నిఖిల్ టీమ్ నుండి సోనియా, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక ఇద్దరికి నలభై అయిదు నిమిషాల్లో తాలిని తినాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక వారిద్దరూ మరొకరిని హెల్ప్ కోసం పంపించాడు బిగ్ బాస్. యష్మీ, ఆదిత్య ఓం ఇద్దరు వెళ్ళగా వాళ్ళు కూడా ఆ తాలిని తినలేకపోయారు. ఇక నలభై అయిదు నిమిషాలు పూర్తవ్వడంతో బజర్ మోగించేశాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ఏ టీమ్ గెలవలేదు. తర్వాతి టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...