English | Telugu

విష్ణుప్రియకి ప్రపోజ్ చేసిన పృథ్వీ!

ఇదేందయ్యా సామి.. నిన్న మొన్నటి దాకా పృథ్వీ వెనకలా విష్ణుప్రియ ఎంత తిరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో తనకోసం ఏకంగా పాటలు పాడేస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ, పృథ్వీ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండే అతడిపై విష్ణుప్రియ కాస్త ఇష్టం పెంచుకుంది. ఇక హౌస్ లో‌ తనకి ఏది అడిగినా చేసి పెడుతూ.‌ కాఫీ కలిపి ఇస్తూ.. అలా అలా నడిపిస్తోంది. కానీ మన పృథ్వీ అసలు పట్టించుకోలేదు కానీ తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఎవరెవరో .. నాకెదురైనా అని పృథ్వీ పాడాడు. ఇక ఇది ఎవరి కోసం పాడుతున్నావని అడుగగా.. విష్ణుప్రియ కోసమని పృథ్వీ చెప్పాడు. దాంతో హౌస్ అంత ఒకటే అరుపులు. వీరితో పాటు మన ఎడిటర్ మావ కూడా ఓ లవ్ సాంగ్ ఏసేసాడు. ఉండిపోరాదే గుండె నీదేలే అంట వారిద్దరిని చూపిస్తూ ఎడిటర్ ఈ ప్రోమోలో ఆడ్ చేశాడు.

హౌస్ లో కొత్తగా కిర్రాక్ సీత క్లాన్ మొదలైంది. ఇక కాంతారా టీమ్ కి శక్తి టీమ్ కి మధ్య టాస్క్ లు సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పడంతో.. కంటెస్టెంట్స్ అంతా తమ వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నారు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...