English | Telugu

దీపావళి వేడుకల్లో కంటెస్టెంట్స్... కన్నుల విందుగా ప్రోమో!

బిగ్ బాస్ సీజన్-8 జోరుగా సాగుతోంది. హౌస్ లో నామినేషన్ టాస్క్ లతో పాటు దీపావళి సంబరాలు కూడా జరిగాయి. దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ రోజు ఎంటర్‌టైన్మెంట్ కి లోటు లేదన్నట్టుగా ఈ ప్రోమో ఉంది.

తాజాగా వచ్చిన ప్రోమో(Biggboss 8 Telugu promo) లో అసలేం ఉందంటే.. ముద్దు గారే యశోద అంటూ పాటని ఆలపించింది హరితేజ. ఇక ఆమెతో పాటు హౌస్ మేట్స్ అంతా భక్తిశ్రద్ధలతో పాటని అనుకరించారు. ఇక పూజ తర్వాత అందరికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.‌ కొన్ని గ్రూప్ లుగా సపరేట్ చేసి దీపావళికి సంబంధించిన కొన్ని డ్రాయింగ్ లని గీయమన్నాడు బిగ్ బాస్.‌ అందులో ఒక టీమ్ కృష్ణుడి బొమ్మగా గీసి కలర్స్ వేయగా, మరొక టీమ్ రాధ బొమ్మని గీసినట్టుగా తెలుస్తుంది.

నిన్న హౌస్ లో పృథ్వీ, నిఖిల్, యష్మీ, ప్రేరణ మధ్య సాగిన ఇష్యూ గురించి పెద్ద చర్చే జరిగినట్టుగా ఉంది. మరోవైపు ఎంటర్‌టైన్మెంట్ పరంగా విష్ణుప్రియ జీరో అని..‌కనీసం ఎంకరేజ్ మెంట్ కూడా లేదంటూ రోహిణి బాధపడింది. ఇక అవినాష్, టేస్టీ తేజని టార్గెట్ చేసి కన్నడ బ్యాచ్ ఆట నుండి తీసేసారు. కన్నడ బ్యాచ్ ఖాతాలో నబీల్ కూడా బలి అయ్యాడు.‌ మరి వీళ్లు ఆడే గ్రూప్ గేమ్ ని వీకెండ్ లో నాగార్జున అడుగుతాడో లేదో చూడాలి. ఇప్పటికైతే నామినేషన్ లో ఉన్నవారిలో నయని పావని, టేస్టీ తేజ, హరితేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.