English | Telugu
Bigg Boss 9 Telugu: శ్రీజ ఎలిమినేషన్.. కెప్టెన్సీ రేస్ లో భరణి కుటుంబం!
Updated : Nov 1, 2025
బిగ్ బాస్ ఏ సీజన్ లో చూడని వింతలు విశేషాలు ఈ సీజన్-9 లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ వారం శ్రీజ, భరణిలని రీఎంట్రీగా తీసుకొచ్చాడు బిగ్ బాస్. వాళ్లు పర్మినెంట్ హౌస్ మేట్ కావాలంటే ప్రేక్షకుల ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్లే పర్మినెంట్ హౌస్ మేట్. ఓటింగ్ ప్రకారం ఎవరు లీడ్ లో ఉన్నారో బిగ్ బాస్ హ్యామర్ తో బాక్స్ ని పగులగొట్టి చూడమని నిఖిల్, గౌరవ్ లకి చెప్తాడు.
హ్యామర్ తో కొట్టి చూడగా భరణి ఫోటోకి స్టే అని, శ్రీజ ఫోటోకి ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. దాంతో భరణి కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కళ్యాణ్ బాధపడుతుంటే శ్రీజ ధైర్యం చెప్పి హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతుంది. ఇక భరణి పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యాడు. భరణికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.
అయిదుగురిని కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలక్ట్ చేసుకోమని, అందులో మీరు కూడా ఉండొచ్చని భరణితో బిగ్ బాస్ చెప్తాడు. కాసేపటికి భరణి దగ్గరికి మాధురి వస్తుంది. బాయ్స్ తో పోటీ పడలేము కదా ఉన్న అయిదుగురికి ఉమెన్స్ కి ఛాన్స్ ఇవ్వండి అని మధురి అడుగుతుంది కానీ తన మాట పట్టించుకోకుండా భరణి తన డెసిషన్ చెప్తాడు . దివ్య, తనూజ, శ్రీనివాస్ సాయి, నిఖిల్, ఇంకా నేను అని భరణి చెప్తాడు.
ఇక కెప్టెన్సీ రేస్ లో భరణి తన ఇద్దరు కూతుళ్ళతో బరిలో ఉన్బాడు. దివ్య అంటే తన తరపున టాస్క్ ఆడి గెలిచింది దివ్యని తీసుకున్నాడు.
తనూజని తీసుకోకుంటే ఫీల్ అవుతుందని అలా తనని కూడా తీసుకున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చానని భరణి చెప్పాడు కానీ అసలు కెప్టెన్ కానీవాళ్లు రీతూ ఉంది, మాధురి ఉంది కదా వాళ్ళని ఎందుకు కన్సిడర్ చెయ్యలేదని రీతూ, మాధురి ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి భరణి డెసిషన్ మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.