English | Telugu
శైలజ గారిని స్నేక్ అన్న ఈర్య...
Updated : Oct 31, 2025
సరిగమప లిటిల్ చాంప్స్ ప్రోమో చూసి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఏంటి డైలాగ్స్ మార్చండి అంటూ కామెంట్స్ లో మండిపడుతున్నారు. విషయం ఏమిటి అంటే ఈ షోకి డ్రామా జూనియర్స్ లో చేసిన ఈర్య వచ్చింది. రాగానే పెద్ద పెద్ద డైలాగ్స్ వేసింది. ఆ షోలో ఉన్నంత వరకు అనిల్ మామ అనిపించారు. ఇక ఇందులో అనంత్ మామ అనిపించడం మొదలుపెట్టారు. "నువ్వెందుకు వచ్చావమ్మ" అని శైలజ అడిగేసరికి "అందరి లెక్కలు తెలుస్తా ఈర్య తిక్కేంటో చూపిస్తా" అంది. "ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మా అంటారు కానీ నేను మామ" అంటాను అనేసరికి అనిల్ రావిపూడి థ్యాంక్యూ ఈర్య అన్నారు. వెంటనే ఆ పిల్ల "ఐ లవ్ యు అనంత్ మామ" అనేసింది.
"ఎందుకె అటెల్లిపోయావ్" అని అనిల్ అడిగేసరికి "అయ్యో సర్ ఎవరండీ మీరు" అంది. "నువ్వేం తింటున్నావ్" అని అనంత్ శ్రీరామ్ ని అడిగింది. "స్నాక్స్ అమ్మ" అన్నాడు. "మీరు చాలా గ్రేట్. స్నేక్స్ పక్కన కూర్చుని స్నాక్స్ తింటున్నావా" అనేసింది. దానికి శైలజ వెంటనే ఏయ్..నోరు కొంచెం తగ్గించు..అన్నారు. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే నే వెళ్ళిపోతా" అన్నారు శైలజ. వెంటనే సెల్ చూసింది ఈర్య. "ఏంటి సెల్ చూస్తున్నావ్" అన్నారు. "మీరే వెళ్ళిపోతా అన్నారుగా అందుకే క్యాబ్ బుక్ చేస్తున్నా" అంది ఈర్య. ఇక అనిల్ రావిపూడి వెంటనే "సుధీర్ నువ్వు ఆ అమ్మాయిని బయటకు పంపిస్తే నీకు సినిమాలో వేషం ఇస్తా" అన్నాడు. ఇలా పెద్దా చిన్నా లేకుండా స్నేక్స్ అనేసరికి నెటిజన్స్ ఘాటుగా రిప్లైస్ ఇస్తున్నారు. "ఆ పాప మాట్లాడితే క్యూట్ ఉంటది...బట్ ఇలాంటి మాటలు, వేషాల వల్ల ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోతుంది శైలజ గారితో అలా మాట్లాడటం నచ్చలేదు..ఒకే వయసు పిల్లలపై పంచ్‌లు వేయడం వేరు, కానీ ఇక్కడ పెద్దలపై హద్దు మీరు డైలాగ్స్ వేయడం మంచిది కాదు, తల్లిదండ్రులు ఇలాంటి పంచ్‌లు అంగీకరించే ముందు ఆలోచించాలి. దయచేసి శైలజా మేడమ్ మీద కాదు, మంచి విషయాల మీద పంచ్ లు రాయండి. శైలజ మేడంకి గౌరవం ఇవ్వాలి.. శైలజా గారితో అలా మాట్లాడే విధానం మార్చండి..ఇంతకు ముందు కూడా ఆమె శైలజ గారితో అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు సుధీర్ ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఆమె ఆపలేదు. తల్లిదండ్రులు ముందు మర్యాద నేర్పించాలి. ఈ ప్రోగ్రాంలో సరిగమల కన్నా. ఇలాంటి పదనిసలు ఎక్కువగా ఉన్నాయి..పెద్ద వాళ్ళను చిన్న పిల్లల చేత అలా అనిపించకూడదు, అసలు ఈ ప్రోగ్రాం తీసెయ్యండి." అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.