English | Telugu

ర‌వి, ల‌హ‌రి మిడ్‌నైట్ హ‌గ్‌ను హైలైట్ చేసిన ప్రియ‌.. మొద‌లైంది ర‌చ్చ‌!

ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కౌగిలించుకుంటే తేడాగా మాట్లాడే మనుషులు మనకు సమాజంలో కనిపిస్తారు. ఏవేవో నిందలు వేస్తారు. 'బిగ్ బాస్' హౌస్‌లోనూ అదే జరిగింది. యాంకర్ రవి, నటి లహరి షెహరి మీద ఆర్టిస్ట్ ప్రియ నింద వేసింది. దాంతో హౌస్‌లో ఒక్కసారి మాటల మంటలు చెలరేగాయి. మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో నిందాస్తుతి మొదలైంది.

ఆర్టిస్ట్ ప్రియను లహరి నామినేట్ చేసింది. మన మధ్య ఎందుకు డిస్టెన్స్ వచ్చిందో తెలియడం లేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అందుకు ప్రియ "నువ్వు సేఫ్ గేమ్ ఆడకు. నువ్వు వేరే మగాళ్లతో బిజీగా ఉంటున్నావ్" అని ఘాటుగా స్పందించింది. అక్కడ మొదలైన గొడవ, తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది.

తనను నామినేట్ చేసిన లహరిని ప్రియ నామినేట్ చేసింది. అప్పుడు ఎందుకు నామినేట్ చేసిందో చెబుతూ... ఆ తర్వాత "నువ్వు వాష్ రూమ్ దగ్గర మిడ్ నైట్ రవిని హగ్ చేసుకోవడం (కౌగిలించుకోవడం) నేను చూశా. బహుశా... అది ఫ్రెండ్లీ హగ్ కూడా కావచ్చు" అని అన్నది. దాంతో రవి, లహరి, సన్నీ ముగ్గురూ ప్రియపై విరుచుకుపడ్డారు.

"ఇక్కడ హగ్ చేసుకోకూడదనే రూల్ ఏమైనా ఉందా?" అని రవి ప్రశ్నిస్తే... "కౌగిలింతను తప్పుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు" అని సన్నీ అన్నాడు. నిజం చెప్పాలంటే... ప్రియ అలా అనడానికి ముందు రవి, ఆమె కలిసి లహరి గురించి మాట్లాడుకున్నారు. కానీ, మిడ్ నైట్ హగ్ అనేసరికి లేనిపోని రూమర్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో రవి, లహరి ఫైర్ అయ్యారు. ఈ కౌగిలింత రచ్చ ఎంతదూరం వెళుతుందో చూడాలి. ప్రియ మాటలపై సోషల్ మీడియాలోనూ నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.