English | Telugu
మెగాస్టార్ అల్లుడికి చెల్లెలుగా అరియనా!
Updated : Aug 12, 2021
'బిగ్‌బాస్-4' హౌస్‌లో బ్యూటీస్ అంటే దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, దివి, అరియనా. హౌస్‌లోకి వెళ్లడానికి ముందు, ఆ తర్వాత హారిక యూట్యూబ్ వీడియోస్‌తో ఆడియన్స్‌కి టచ్‌లో ఉంటోంది. రియాలిటీ షోలు, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో మోనాల్ కూడా వార్తల్లో నిలుస్తోంది. దివికి చెప్పుకోదగ్గ అవకాశాలు ఏవీ ఇప్పటికి అయితే రాలేదు. మెగాస్టార్ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని చెబుతోంది.
అయితే, ఈ ముగ్గురి కంటే అవకాశాల వేటలో అరియనా దూసుకు వెళుతోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ సినిమాలో అరియనా నటిస్తోంది. హీరో స్నేహితుడు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమెకు కీలక పాత్ర దక్కింది.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అందులో కళ్యాణ్ దేవ్ చెల్లెలి పాత్రలో అరియనా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేస్తోంది. దర్శకుడు శ్రీధర్ సీపానతో అరియనాకు రెండో సినిమా ఇది. ఇంతకు ముందు అతడి దర్శకత్వంలో 'బృందావనమది అందరిది'లో చేసింది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.