English | Telugu
'దేవి' సినిమా షూటింగ్‌లో వనితకు నిజంగా బొట్టు పెట్టిన పాము!
Updated : Aug 11, 2021
నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనితా విజయ్‌కుమార్. తరచూ వివాదాస్పద వార్తలతో నలుగురి నోళ్ళల్లో నానుతుంది. ముఖ్యంగా వనితా విజయ్‌కుమార్ పెళ్లిళ్లు డిస్కషన్ పాయింట్ అవుతుంటాయి. అయితే, ఆమె యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలని అనుకుంటుంది. తెలుగులో ఇరవైఏళ్ళ క్రితం 'దేవి'లో ఆమె నటించింది. ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేయడానికి రెడీ అని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పింది.
'దేవి సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ ఎందుకు రాలేదు? రాకపోవడానికి కారణం ఏమిటి?' అని ఆలీ ప్రశ్నించారు. 'బుర్ర సరిగా లేక' అని వనితా విజయ్‌కుమార్ ఆన్సర్ ఇచ్చారు. 'తెలుగు ఇండస్ట్రీలోకి మళ్ళీ రావాలనే ఆలోచన ఉందా?' అని ఆలీ ప్రశ్నించగా... "చిన్నతనం నుండి నేను నాగార్జునగారికి పెద్ద ఫ్యాన్. ఆయనతో నటించాలని ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. లైఫ్‌లో అతనితో ఒక్క షాట్ లో అయినా యాక్ట్ చేయాలనేది నా డ్రీమ్" అని వనితా విజయ్ కుమార్ తన మనసులో కోరికను బయటపెట్టారు.
"దేవి సినిమా షూటింగ్‌లో నిజమైన పాము నాకు నుదిటి మీద నిజంగా పెట్టింది. బొట్టుపెట్టి కిందకు దిగిన పాము నా చేయిని నోటితో పట్టుకుంది. అప్పుడు నాకు బ్లడ్ వచ్చింది. అప్పుడు మమ్మీ పామువల్ల చనిపోతే పర్వాలేదు అంది." అని చాలామందికి తెలీని అప్పటి విషయాన్ని షేర్ చేసుకున్నారు వనిత. ఆగస్ట్ 16న ప్రసారమయ్యే ఇంటర్వ్యూతో వనిత ఇంకా ఏమేం విషయాలు చెప్పారనేది తెలుస్తుంది.