English | Telugu
ఉత్కంఠభరితంగా మారిన నేటి కథనం.. ఆమె ఎవరు?
Updated : Aug 8, 2024
బుల్లితెర ధారావాహికల్లో కొత్త సీరియల్స్ హవా కొనసాగుతుంది. ఇందులో ఓ సీరియల్ ఎవరి అంచనాలకి అందకుండా రోజు రోజుకి అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. ప్రతీరోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఆకట్టుకుంటున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ స్టార్ మా టీవీలో ప్రతీరోజు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం నాలుగు గంటలకి ప్రసారమవుతుంది.
స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది. మరి అంతగా ఝ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. ఇక ఈ జన్మకి సంబంధించిన పరిచయంలో.. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు
ఇక రామలక్ష్మి, సీతాకాంత్ ల పెళ్ళి అనుకోకుండా జరుగుతుంది. సీతాకాంత్ ని పెంచిన సవతి తల్లి శ్రీలత కుట్రని తెలుసుకున్న రామలక్ష్మి తనకి బుద్ధి చెప్పాలని చూస్తుంది. అదే సమయంలో శ్రీలత మాస్టర్ ప్లాన్ వేసి తన కొడుకు సందీప్ ని ఆఫీస్ లో మేనేజర్ ని చేస్తుంది. అదే సమయంలో నమితని వాడుకొని సీతాకాంత్ ని స్టేషనుకి పంపిస్తుంది శ్రీలత. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో నమితని కన్విన్స్ చేసి సీతాకాంత్ తప్పులేదని నిరూపించాలని రామలక్ష్మి తన దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో శ్రీలత కొంతమంది రౌడీలని పంపుతుంది. ఆ రౌడీలు రామలక్ష్మి, నమితలని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుండి ఓ మోడ్రన్ అమ్మాయి దిగుతుంది. తనని రామలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. అసలు ఎవరు తను? సీతాకాంత్ పంపించాడా? లేక రామలక్ష్మి ఫ్రెండ్ ఆ అనేది తెలియాల్సి ఉంది. దీంతో నేటి కథనం ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.