English | Telugu
అఖిల్ మెడలో ఫేక్ బోర్డ్.. బిందు మాధవి స్మార్ట్ గేమ్!
Updated : Mar 17, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ 25వ ఎపిసోడ్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కెప్టెన్సీ పోరులో సీక్రెట్ టాస్క్ లు ఒక ఎత్తైతే ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా అనీల్ కి.. అలకరాజ్ అఖిల్ కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అఖిల్, అషు రెడ్డి, స్రవంతి, అజయ్ బ్యాచ్.. యాంకర్ శివ గురించి గుసగుసలాడటం మొదలుపెట్టారు. సుస్సు పోవడానికి.. సిగరేట్ కాల్చడానికి అతనికి పర్మీషన్ ఎవరిచ్చారంటూ రూల్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక హౌస్ లో వున్న వాళ్లలో ఎవరు ఫేక్ అన్నది తెలుసుకోవడానికి బిగ్ బాస్ రహస్య బ్యాలెట్ ఓటింగ్ ని చేపట్టారు. దీనిలో బాగంగా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున ఎవరు ఫేక్ అన్నది చెప్పాలని కోరారు.
అయితే ఈ రహస్య బ్యాలెట్ విధానంలో ఎక్కువ మంది ఇంటి సభ్యులు అఖిల్ ని ఫేక్ అని తేల్చేశారు. అతనితో పాటు నటరాజ్ మాస్టర్ ని కూడా ఫేక్ అని తేల్చేయడంతో ఈ ఇద్దరికి మైండ్ బ్లాక్ అయింది. తదుపరి ఆదేశం వచ్చే వరకు అఖిల్, నటరాజ్ లు `ఐ యామ్ ఫేక్` అనే బోర్డ్ లు ధరించాలని శిక్ష విధించారు. అనంతరం బిగ్ బాస్ `ఐ యామ్ ఫేక్` బోర్డ్ లు పంపడంతో వాటిని మెడలో వేసుకుని బావురు మన్నారు అఖిల్, నటరాజ్.
ముందు అఖిల్ పేరు చెప్పగానే "వాట్ ది.." అంటూ అషురెడ్డి ఓ రేంజ్ లో ఫైరయింది. ఇక స్రవంతి అయితే అఖిల్ కి రావడం ఏంటీ? అంటూ తెగ ఆశ్చర్యపోయింది. దీంతో అషురెడ్డి హౌస్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు అఖిల్ కి వేసి వుంటారు. వాళ్లెవరో మనకి తెలుసు.. బయట జనానికి తెలుసు.. అఖిల్ అంటే ఏంటో బిగ్ బాస్ కు చూపిస్తుంటారు కదా.. ఇద్దరు ముగ్గురు నిన్ను ఫేక్ అంటే ఫేక్ అయిపోతావా? .. నువ్వు స్ట్రాంగ్ అని వాళ్లకు తెలుసు. నువ్వు ఇక్కడ వుంటే వాళ్లు గెలవలేరు... వాళ్లకి భయం అందుకే నిన్ను టార్గెట్ చేస్తున్నారని అఖిల్ గురించి చెప్పింది అషురెడ్డి. దీంతో కొత్త చర్చ మొదలైంది. బిందు మాధవి స్మార్ట్ గేమ్ తో ఈ బ్యాచ్ ఏడుపు మొదలైంది.