English | Telugu
ముఖేష్ గౌడ నిర్మాణంలో కొత్తగా చిత్రం..పేరు మార్చుకున్న రిషి సర్
Updated : Aug 17, 2024
గుప్పెడంత మనసు హీరో ముఖేష్ గౌడ తన ఫాన్స్ కి లేటెస్ట్ అప్ డేట్ చెప్పాడు. తన సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు.‘‘ప్రతి కొత్త ప్రారంభం మన మీద మరింత బాధ్యతను పెడుతుంది. వరలక్ష్మీ వ్రతం రోజున.. చాముండేశ్వరి ఆశీర్వాదంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. నా కొత్త సినిమా పేరు ‘తీర్థరూప తాండేయవారిగే’. తెలుగులో ‘ప్రియమైన నాన్నకు’ అనే టైటిల్ తో మీ ముందుకు రాబోతున్నాను. నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. దీంతో కొత్త జర్నీ ప్రారంభమైంది. ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదాలు.
జై చాముండేశ్వరి’’ అంటూ తనకి ఎంతో ఇష్టమైన చాముండేశ్వరి దేవి ఆశీస్సులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ. ఈ మూవీ షూటింగ్ కారణంగానే గుప్పెడంత మనసు సీరియల్ లో కొన్ని రోజులు కనిపించలేదు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్‌లో ముఖేష్ గౌడనే నిర్మిస్తున్నాడు. 2025 సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి రిషి తన స్క్రీన్ నేమ్ ని రివీల్ చేశారు. తన పేరుని నిహర్ ముఖేష్ బిగా మార్చుకున్నాడు. ఇక మూవీలో కనిపించబోతున్న రిషి సర్ కి అభిమానులంతా కంగ్రాట్స్ చేస్తున్నారు.