English | Telugu
ఊహించని ట్విస్ట్: తులసి కాళ్లు పట్టుకుని బోరుమన్న నందు
Updated : Nov 13, 2021
జీ తెలుగులో ప్రసారం అవుతున్న ధారావాహిక `ఇంటింటి గృహలక్ష్మి`. ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గత కొన్ని ఎపిసోడ్‌లని పరిశీలిస్తే లాస్య మాయలో పడిన నందు భార్య తులసిని అనుమానిస్తూ అవమానిస్తూ చివరికి ఆమెకు విడాకులిస్తాడు. అయితే తులిసి నిజాయితీ తెలిసిన నందు తండ్రి ఆమెకు అండగా నిలిచి తన ఇంటిని ఆమె పేరు మీద రాసేస్తాడు.
దీంతో నందుకకు విడాకులిచ్చినా తులసి ఇంట్లోనే వుండిపోతుంది. గత కొంత కాలంగా లాస్య ప్రవర్తనతో విసిగెత్తిపోయిన నందు తులసితో కలిసి ఆఫీస్ పనిమీద క్యాంప్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా కలుసుకున్న భార్యా భర్తల మధ్య పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఈ రోజు ఎపిసోడ్ రసవత్తర మలుపులు తీసుకోబోతోంది. హోటల్ రూమ్‌లో తులసిని వదిలి బయటికి వెళ్లిన నందు చిత్తుగా తాగి వస్తాడు.
ఇది గమనించిన తులసి తాగి వచ్చారా? అని నందూని నిలదీస్తుంది. మనం మాజీ భార్యా భర్తలం అన్నావ్.. ఎవరిదారి దారిది అన్నావ్ ఇప్పుడ నన్నెందుకు నిలదీస్తున్నావ్ అంటాడు నందు. దానికి తులసి సారీ చెబుతుంది. ఆ తరువాత `నీతో నిజాలు చెప్పాలని.. అందుకు ధైర్యం చాలకే తాగి వచ్చానని అంటాడు నందు. ఆ తరువాత తులసి - నందుల మధ్య ఆసక్తికర మాటలు చోటు చేసుకుంటాయి. అయితే లాస్య లాంటి మాయ లేడి వలలో పడ్డానని, తన నుంచి కాపాడమని నందు వేడుకుంటూ తులసి కాళ్లపై పడటం.. తులసి .. నందుని ఓదార్చడం .. చివరకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడం ఈ రోజు ఎపిసోడ్‌లోని కీలకాంశాలు. అయితే నందు నిజంగానే తులసి కోసం ఏడ్చాడా? .. నందు లాస్యని వదిలించుకోవాలని నిజంగానే భావిస్తున్నాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు జీ తెలుగులో ప్రసారం అయ్యే `ఇంటింటి గృహలక్ష్మీ` ఎపిసోడ్ చూడాల్సిందే.