English | Telugu
వర్షంలో భర్తతో కలిసి అనసూయ ఆటలు...
Updated : Aug 22, 2024
అనసూయ ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఆమె కామెంట్స్ కానీ ఆమె పోస్టులు కానీ అందరినీ తనవైపు తిప్పుకునేలానే ఉంటాయి. రీసెంట్ గా అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. వర్షంలో తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కనిపించింది.
ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్టైలిష్ లుక్ లో అందరినీ మెస్మోరైజ్ చేస్తూ కనిపించింది. ఇలాంటి పిక్స్ పెట్టగానే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. అనసూయ కూడా అదే పెట్టింది. "వాళ్లేమంటారంటే ఈవిడేంటి ప్రతీ విషయాన్ని పోస్ట్ చేయాలా అని అంటారు. ఐతే నేను ఏమంటానంటే మా మధ్య ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని అందరికీ తెలియడం కోసం..మా మధ్య కూడా ఇలాంటి అందమైన క్షణాలు, నిజమైన ప్రేమ ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకోటేంటంటే ఇలాంటి మెమోరీస్ దాచుకోవడం కోసం కూడా" అని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఇక్కడ వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరేమో వర్షంలో బాడ్మింటన్ ఆడుతున్నారు." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2'తో పాటు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అలాగే అనసూయ ఇతర భాషల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అనసూయ తన కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫామిలీ ఫొటోస్ ని తన ఇంట్లో పెంచుకునే పక్షుల ఫొటోస్ ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.