English | Telugu

'అన్‌స్టాపబుల్'కి అల్లు అర్జున్.. వెనక్కి తగ్గిన రవితేజ!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకి సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రసారమైన ఐదు ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో ఆరో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆరో ఎపిసోడ్ గెస్ట్ లుగా మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆహా.. ఇప్పుడు ఆరో ఎపిసోడ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుందని ట్విస్ట్ ఇచ్చింది.

'అన్ స్టాపబుల్' షో ఆరో ఎపిసోడ్ గా పక్కా మాస్ ఎపిసోడ్ లోడ్ అవుతుందని.. ఇందులో బాలయ్యతో కలిసి క్రాక్ కాంబో రవితేజ, గోపీచంద్ సందడి చేయనున్నారని ఆదివారం నాడు ఆహా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కూడా కానుందని తెలిపింది. అయితే తాజాగా ఆరో ఎపిసోడ్ విషయంలో ఆహా ట్విస్ట్ ఇచ్చింది. అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ఆరో ఎపిసోడ్ గా ప్రసారం కానుందని మంగళవారం నాడు ప్రకటించింది. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ప్రసారం కానుందని పేర్కొంది. 'అన్ స్టాపబుల్ మీట్స్ తగ్గేదేలే' అంటూ అఖండ ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య, బన్నీ కలిసి దిగిన ఫోటోని ఆహా పంచుకుంది. రవితేజ, గోపీచంద్ పాల్గొన్న ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ని కూడా ఆహా ఇచ్చింది. ఈ క్రాకింగ్ మాస్ ఎపిసోడ్ లో న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో బన్నీ డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ ఎపిసోడ్ ని ముందుకి తీసుకొచ్చి రవితేజ ఎపిసోడ్ ని పోస్ట్ పోనే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బన్నీతో పాటు సుకుమార్, రష్మిక కూడా పాల్గొనే అవకాశముందని సమాచారం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.