English | Telugu

 హీరో శ్రీ‌కాంత్ తో హీరోయిన్ ఫైట్.. కార‌ణం ఏంటీ?

సినిమాల్లో చాలా వ‌ర‌కు ముందు అనుకున్న స‌న్నివేశాలు కాకుండా స్పాట్ ఇంవ్రూవైజేష‌న్ చేసి సీన్ లు మారుస్తుంటారు. దీంతో ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్ర‌కారం ఆర్టిస్ట్ లు సెట్ లో చెప్పింది చేయాల్సి వుంటుంది. అది న‌చ్చ‌క‌పోయినా.. న‌చ్చినా ఆ సీన్ చేయాల్సిందే. అలాంటి సంద‌ర్భమే హీరోయిన్ మాళ‌వికకు ఎదురైంద‌ట‌. అదే విషయాన్ని తాజాగా `ఆలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించించి షాకిచ్చింది. ఈ కార్య‌క్ర‌మానికి తాజాగా గెస్ట్ గా హాజ‌రైన మాళ‌విక తెలుగు సినిమాల‌కు ఎందుకు దూరం కావాల్సి వ‌చ్చిందో.. శ్రీ‌కాంత్ కు త‌న‌కు మ‌థ్య ఫైట్ ఎందుకు జ‌రిగిందో వివ‌రించింది.

Also Read:శ‌ర్వానంద్.. `ఫిబ్ర‌వ‌రి` ఫీల్ గుడ్ ఫార్ములా!

తాజాగా `ఆలీతో స‌ర‌దాగా` ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో మాళ‌విక చెప్పిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. `చాలా బాగుంది` మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఏం జ‌రిగిందిని ఆలీ అడిగితే త‌న‌కు `చాలా బాగుంది` తెలుగులో మొద‌టి చిత్ర‌మని, ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో శ్రీ‌కాంత్ మ‌ధ్య‌లోనే కోపంతో వెళ్లిపోయారంది. రొమాంటిక్ సాంగ్ షూటింగ్ స‌మ‌యంలో తాను కాస్త ఇబ్బంది ప‌డ్డాన‌ని, త‌న‌కు అంత కంఫ‌ర్ట్ లేద‌ని చెప్పాన‌ని, అయితే ఈ స‌మ‌యంలో శ్రీ‌కాంత్ తో చిన్న ఫైట్ జ‌రిగింద‌ని తెలిపింది.

Also Read:నా భర్త కూడా సమంత హాట్‌ గా ఉందన్నాడు!

తెలుగులో కేవ‌లం 5 చిత్రాలు మాత్ర‌మే చేశాన‌ని, త‌మిళంలో మాత్రం 35 చిత్రాలు చేశాన‌ని తెలిపింది. ఇక ఈవీవీ గారితో క‌లిసి ప‌ని చేయ‌డం ఎలా వుంద‌ని ఆలీ అడిగితే చాలా బాగుంద‌ని, కాక‌పోతే ఆ రేప్ సీన్ మాత్రం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని తెలిపింది. నెగెటివ్ క్యారెక్ట‌ర్ అని చెప్పుకొచ్చింది. హిందీలో `సీ యూ ఎట్ నైట్‌` అనే సినిమా చేశాన‌ని, ఇప్ప‌టికీ ఆ సినిమా ఎందుకు చేశానా? అని ఫీల‌వుతుంటాన‌ని తెలిపింది.