English | Telugu
Bigg Boss 9 Telugu Rithu Chowdary : నేను టాప్-5 లో ఉండాలనుకున్నా బిగ్ బాస్.. వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ!
Updated : Dec 8, 2025
బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వీక్ లో రీతూ చౌదరి అనూహ్యంగా బయటకు వచ్చింది. నామినేషన్ రౌండ్ సంజన, రీతూకి మధ్య జరిగింది. రీతూ ఎలిమినేట్ అయ్యాక చాలా ఎమోషనల్ అయింది. పవన్ ని బాగా చూసుకోండి. కళ్యాణ్ నువ్వు వాడితో మాట్లాడడం లేదని వాడు ఫీల్ అవుతున్నాడు.. ప్లీజ్ వాడితో మాట్లాడమని కళ్యాణ్ తో రీతూ చెప్తుంది.
నేను టాప్-5 లో ఉంటానని అనుకున్నాను.. అందుకు చాలా కష్టపడ్డాను బిగ్ బాస్.. ఎందుకు ఇలా చేశారని రీతూ ఏడుస్తుంది. రీతూ అందరితో మాట్లాడుతుంది. పవన్ ని హగ్ చేసుకొని ఏడుస్తుంది బాగా ఆడు అని చెప్పి స్టేజి పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఫీలింగ్ అని నాగార్జున అడుగుతాడు. టాప్-5 లో ఉండాలని రోజు యూనివర్స్ ని కోరుకున్నాను సర్ అని రీతూ అంటుంది. కానీ వెరీ గ్రేట్ ఫుల్ సర్ అని చెప్తుంది ఆ తర్వాత రీతూ జర్నీ వీడియోని ప్లే చేస్తారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో రీతూ మాట్లాడుతుంది. ఉన్న ఏడుగురిలో టాప్-7 నుండి పొజిషన్ పెట్టమని రీతూతో నాగార్జున చెప్తాడు.
టాప్-7 గా భరణికి పెడుతుంది. మీరు బయటకు వెళ్లి వచ్చారు ఫైర్ ఉండాలని అందరు చెప్పారని, దివ్యని నామినేట్ చెయ్యడం నాకు నచ్చలేదని రీతూ చెప్తుంది. ఆరవ స్థానం సుమన్ శెట్టికి ఇస్తుంది. అయిదవ స్థానం సంజన, నాల్గవ స్థానం కళ్యాణ్ కి ఇస్తుంది. మూడు, రెండు స్థానాలు తనూజ, ఇమ్మాన్యుయేల్ మీరే డిసైడ్ అవ్వండి అని ఇద్దరి ఫోటోల మధ్యలో పెడుతుంది. డీమాన్ కి ప్రథమ స్థానం ఇస్తుంది. ఆ తర్వాత ఒరేయ్ కళ్యాణ్ నువ్వు నాల్గవ స్థానం కాదురా అని రెండు, మూడు, నాలుగు బోర్డ్స్ కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్యలో పెట్టి మీరే తీసుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత రీతూ వెళ్ళిపోతుంది.