శర్వానంద్.. `ఫిబ్రవరి` ఫీల్ గుడ్ ఫార్ములా!
on Jan 31, 2022

ఒకవైపు ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ లో అలరిస్తూనే.. మరోవైపు యాక్షన్ డ్రామాల్లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు యువ కథానాయకుడు శర్వానంద్. జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా ఎప్పటికప్పుడు మంచి మార్కులు కొట్టేస్తున్న శర్వా.. అన్నీ కుదిరితే ఈ ఫిబ్రవరిలో రెండు సినిమాలతో పలకరించే అవకాశం ఉంది. ఆ చిత్రాలే.. `ఒకే ఒక జీవితం`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. వీటిలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఫిబ్రవరి 25న విడుదల కానుండగా.. `ఒకే ఒక జీవితం`కి ఇంకా రిలీజ్ డేట్ లాక్ కాలేదు.
ఇదిలా ఉంటే.. శర్వానంద్ కి, ఫిబ్రవరి నెలకి ఓ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. అదేమిటంటే.. గతంలో ఈ నెలలో వచ్చిన తన సినిమాలన్నీ కూడా ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామాలే. సహనటుడిగా కనిపించిన `సంక్రాంతి` (2005)తో పాటు కథానాయకుడిగా నటించిన `గమ్యం` (2008), `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` (2015), `జాను` (2020).. ఇలా ఈ ఫిబ్రవరి రిలీజెస్ అన్నీ కూడా `ఫీల్ గుడ్` ఫార్ములాతోనే సాగాయి. అవన్నీ కూడా శర్వాకి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఇక ఇదే నెలలో ఇప్పుడు విడుదలకు సిద్ధమైన `ఒకే ఒక జీవితం`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` కూడా ఒకరకంగా ఆ తరహా సినిమాలేనని ప్రచార చిత్రాలని బట్టి స్పష్టమవుతోంది. మరి.. ఈ రెండు సినిమాలతో శర్వానంద్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



