English | Telugu
Rithu Chowdary Press Meet :డీమాన్ పవన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రీతూ చౌదరి!
Updated : Dec 8, 2025
రీతూ ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక మీడియాతో ముచ్చటించింది. హౌస్ లో డీమాన్ తో మీ లవ్ ట్రాక్ కి గల కారణాలు ఏంటని మీడియా వాళ్లు అడుగగా.. మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్ బాండ్ అంతే. మన స్కూల్, కాలేజీలలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగే వాడితోను ఉన్నానని రీతూ అంది. మీ ఇద్దరి మధ్య మొదలైన ఈ ప్రేమ పెళ్ళి వరకు వెళ్తుందా అని అడుగగా.. అదేం లేదు.. వాడితో నేను హౌస్ లో కంఫర్ట్ గా ఉన్నాను. మా అమ్మ హౌస్ లోకి వచ్చినప్పుడు తనతో దూరంగా ఉండు అని అలా ఏం చెప్పలేదు.. బాగా ఆడుతున్నావనే చెప్పింది. గేమ్ మీద ఫోకస్ చేయమని చెప్పిందని అంది. మరి డీమాన్ తో ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నారని అడుగగా.. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవరు ఆడలేరు.. వాడి గేమ్ వాడు ఆడాడు.. నా గేమ్ నేను ఆడాను.. కానీ కొంతమంది దీనిని ఎలవేట్ చేశారు.
మరి సంజన మీ గురించి అలా మాట్లాడింది కదా.. మీరేమంటారని అడుగగా.. తను అలా మాట్లాడటం నాకు నెగెటివ్ అయిందని నేను అనుకోవడం లేదు. హౌస్ లో వంద కెమెరాలు ఉన్నాయి.. అన్నింటిలో కనపడుతుంది కదా.. నేనైతే నా లిమిట్స్ లోనే ఉన్నానని రీతూ కవర్ చేసింది. లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని ఇలా చేశారా అని అడుగగా.. అదేం లేదు.. హౌస్ లోకి వెళ్ళాక ప్రతీ ఒక్కరు ఎవరో ఒకరితో కనెక్ట్ అవుతారు. నాకు డీమాన్ కనెక్ట్ అయ్యాడు. అతనితో కంఫర్ట్ ఉన్నాను. ఆ కంఫర్ట్ జోన్ ఫ్రెండ్ షిప్ తో చూసేవాళ్ళకే తెలుస్తుందని రీతూ అంది.
డీమాన్ పవన్ టాప్-5 లో ఉంటాడా అని అడుగగా.. అవును ఉంటాడు.. నిన్నటి వరకు నేను హౌస్ లో ఉండాలనే ఆడాను. మొదటి రోజు నుండి నేను బయట ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాను.. కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్నాను.. కానీ దాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు.. డీమాన్ తో ఉన్నదే ఎలివేట్ చేసి చెప్తున్నారు. డీమాన్ పవన్ టాప్-5 లో ఉండాలి.. అతనే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నానని రీతూ అంది.